కాళేశ్వరంపై ‘చంద్ర’కుట్ర..హరీష్ ధ్వజం

287
harish rao
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని మంత్రి హరీష్ ధ్వజమెత్తారు. జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం కలికోటలో సూరమ్మ చెరువు రిజర్వాయర్ నిర్మాణ పనులకు శంకుస్ధాపన చేశారు హరీష్ .

ఈ దసరా నాటికి కాళేశ్వరం నీళ్లతో సూరమ్మ చెరువును నింపుతామన్నారు. ఇందుకు అవసరమైన 300 ఎకరాల భూమి ఇస్తే సూరమ్మ చెరువులో నీటిని నింపే బాధ్యత తనదిగా మంత్రి వెల్లడించారు. ఎస్సారెస్సీ పునర్జీవ పథకం ద్వారా వరదకాలువ నిండు కుండలా మారబోతోందన్నారు. రూ. 1600 కోట్లతో మిడ్‌మానేరు పూర్తి చేశామని..కరీంనగర్‌ జిల్లా మరో కోనసీమను తలపించబోతోందని వెల్లడించారు.

harish

సీఎం కేసీఆర్ సంకల్పంతో తెలంగాణ సస్యశ్యామలం కాబోతుందన్నారు. ఓట్ల కోసం కాళేశ్వరాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తే ఎవరూ చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఆపేందుకు కాంగ్రెస్,టీడీపీ నేతలు ఢిల్లీ వెళ్లి సతవిధాలుగా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పోలవరంపై ఒడిశా రాష్ట్రం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. చంద్రబాబు పోలవరం కట్టడం ఆపుతవా అని ప్రశ్నించారు. తెలంగాణకు 954 టీఎంసీలు వాడుకునే హక్కు ఉందని శ్రీకృష్ణ కమిటీ ముందు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ వాటా నీటి కోసమే కాళేశ్వరం, సీతారామ తదితర ప్రాజెక్టులు కడుతున్నట్లు చెప్పారు.

- Advertisement -