ధోనిపై మనసుపడ్డ స్టార్ హీరోయిన్…

325
Bollywood actress wants to go on a bike ride with MS Dhoni
- Advertisement -

బాలీవుడ్‌ హీరోయిన్ కైరా అడ్వాణి మరో సారి మహేంద్రసింగ్‌ ధోనీ పై తనకున్న ఇష్టాన్ని బయటపెట్టింది. అంతేకాకుండా మహేంద్రసింగ్‌ ధోనీతో కలిసి బైక్ రైడింగ్ కు వెళ్లాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టుంది. ‘ఎమ్‌.ఎస్‌.ధోనీ-ద అన్‌టోల్డ్‌ స్టోరీ’ మూవీలో కైరా.. సాక్షి పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

Bollywood actress wants to go on a bike ride with MS Dhoni

2016లో ధోని జీవిత చరిత్ర ‘ఎమ్ఎస్ ధోని, ది అంటోల్డ్ స్టోరీ’ చిత్రంలో ధోని భార్య సాక్షి పాత్రలో కైరా అద్వానీ నటించింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో విలేఖరి ‘మీకు ఎవరితోనైనా బైక్ రైడింగ్ కు వెళ్లాలని ఉందా..?” అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ కైరా అద్వానీ “నాకు ధోనితో బైక్ రైడింగ్ కు వెళ్లాలని ఉంది” అంటూ తన మనసులోని కోరికను చెప్పేసింది.‘ధోనీకి బైకులంటే ఎంతిష్టమో అందరికీ తెలుసు. రాంచీలో ధోనీ తన ఇంట్లో బైక్‌ల కోసం ప్రత్యేక గ్యారేజీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు’ అని చెప్పుకొచ్చింది. ఆమె ప్రస్తుతం మహేష్ బాబు భరత్ అనే నేను మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది కాకుండా విజయ్ తో కూడా ఓ మూవీ చేయనుంది కైరా.

- Advertisement -