ఇండోనేషియాలో విమాన ప్రమాదం.. 62 మంది మృతి..

192
Indonesia plane
- Advertisement -

ఇండొనేషియా రాజధాని జకార్తా నుంచి పోంటియానక్ దీవికి బయలుదేరిన శ్రీ విజయ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ విమానం నిన్న అదృశ్యం అయిన విషయం తెలిసిందే. అయితే ఆ విమానం జావా సముద్రంలో కుప్పకూలగా, విమానం శకలాలను థౌజండ్ ఐలాండ్స్ వద్ద గుర్తించామని అధికారులు వెల్లడించారు. విమానంలో ఉన్న 62 మంది జలసమాధి అయ్యుండవచ్చని, వారి ఆచూకీ గురించి నాలుగు యుద్ధ విమానాలు, నౌకలతో గాలింపు చర్యలను ముమ్మరంగా చేస్తున్నామని ఆ దేశ రవాణా మంత్రిత్వ శాఖ ప్రతినిధి అదిత ఐరావతి తెలిపారు. ఇందుకోసం జాతీయ రవాణా భద్రత కమిటీతో పాటు నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజన్సీ రంగంలోకి దిగాయని అన్నారు.

ఇండోనేషియాలో గతంలోవిమాన ప్రమాదాలు..
-2018 అక్టోబర్‌ 29న లయన్‌ ఎయిర్‌కు చెందిన బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానం కూలి 189 మంది ప్రాణాలు కోల్పోయారు.
-2014లో సురబాయ నుంచి సింగపూర్‌ వెళ్తున్న ఎయిర్‌ ఏషియా విమానం సుముద్రంలో కూలి 162 మంది చనిపోయారు.
-1997లో సుమత్రా దీవిలో విమానం కూలిన ఘటనలో 234 మంది మృతి చెందారు.

- Advertisement -