బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదు- మంత్రి హరీష్‌

95
harish rao minister

దుబ్బాక నియోజకవర్గం చీకోడు గ్రామంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత రెడ్డితో కలిసి మంత్రి హరీష్‌ రావు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలు గోబెల్స్ ప్రచారంతో ఓట్లు అడుగుతున్నారు. 7250 కోట్లు వానా కాలం పంటకు రైతు బంధు తెరాస ఇస్తే..బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇచ్చిందా అని ప్రశ్నించారు. బీడీ కార్మికులకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క రూపాయి ఇచ్చారా..కాంగ్రెస్ హయాంలో చెప్పులు లైన్లో పెడితే తప్ప ఎరువు బస్తా దొరికేది కాదు. దొంగరాత్రి కరెంటు కాంగ్రెస్ ఇస్తే…తెరాస 24 గంటల కరెంటు ఇచ్చింది.

కరెంటు ఇవ్వక కాంగ్రెస్ రైతులను చంపితే.. బీజేపీ బావుల దగ్గర మీటర్లు పెట్టి చంపాలని చూస్తోందని మంత్రి మండిపడ్డారు. జగన్ కేంద్రం నుంచి డబ్బులు తీసుకుని శ్రీకాకుళంలో మీటర్లు పెట్టడం ప్రారంభించారు. కానీ మన సీఎం కేసీఆర్ మేం మీటర్లు పెట్టం అని ప్రధాని మోదీకి లేఖ రాశారు. దుబ్బాక గడ్డపై బీజేపీకి పరాభవం తప్పదు, బీజేపీకి డిపాజిట్ దక్కదు. డబ్బాలో రాళ్లు వేసి ఊపడం.. సోషల్ మీడియాలో ఊగడం ఇదే బీజేపీ పరిస్థితి అని మంత్రి హరీష్‌ రావు ఎద్దేవ చేశారు.