BJP:బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఏకే ఆంటోనీ తనయుడు..!

45
- Advertisement -

కాంగ్రెస్ సినీయర్‌ నేత ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్‌ ఆంటోనీ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయెల్, వి మురళీధరన్, బీజేపీ కేరళ ఆధ్యక్షుడు కే సురేంద్రన్‌ సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. దీంతో కేరళ కాంగ్రెస్‌లో అలజడి మొదలైంది. ప్రధాని మోదీపై బీబీసీ చేసిన డాక్యుమెంటరీని వ్యతిరేకిస్తూ చేసిన విషయంలో అనిల్ ఆంటోనీ మోదీకి మద్దతు తెలిపారు. దీంతో కాంగ్రెస్‌ అధీనాయకత్వంతో విభేదాలు తలెత్తడంతో ఈ యేడాది జనవరిలో కాంగ్రెస్‌కు అనిల్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన కేరళ రాష్ట్ర కాంగ్రెస్‌ సోషల్ మీడియా విభాగాన్ని నిర్వహించేవారు.

ఈ సందర్భంగా అనిల్ ఆంటోనీ మాట్లాడుతూ…చాలా మంది కాంగ్రెస్‌ నేతులు ఓ కుటంబం కోసం పనిచేయడమే తమ కర్తవ్యంగా భావిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల కోసం పనిచేయాలని నేను నమ్ముతానని అనిల్‌ ఆంటోనీ చెప్పారు. రాబోయే 25ఏళ్లలో భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మార్చే విషయంలో ప్రధాని మోదీకి స్పష్టమైన అవగాహన ఉందని అందుకోసమే ఆయన ఆహర్నీశలు కృషి చేస్తున్నారని అన్నారు.

పీయూష్ గోయెల్ మాట్లాడుతూ…సుస్థిర అభివృద్ధిపై ఆయన ప్రధాని మోదీ అభిప్రాయాలు ఒకేలా ఉన్నాయన్నారు. పార్టీలో కీలక పాత్ర పోషించడంతో పాటు దక్షిణాదిలో బీజేపీ ఎదుగుదలకు అనిల్ ఆంటోనీ సహాయపడగలరని అన్నారు.

ఇవి కూడా చదవండి…

Kanti Velugu:గొప్ప కార్యక్రమం

BJP:బీజేపీ నీచ రాజకీయాలు మానదా ?

KCR:అంబేద్కర్ అందరివాడు

- Advertisement -