BJP:బీజేపీ నీచ రాజకీయాలు మానదా ?

51
BJP
- Advertisement -

అధికార మదంతో బీజేపీ నేతలు చేస్తున్న కుళ్ళు రాజకీయాలకు ప్రస్తుతం తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాలే నిదర్శనంగా చెప్పవచ్చు. కేంద్రంలో తామే అధికారంలో ఉన్నమనే ధీమాతో తాము ఏం చేసిన చెల్లుబాటు అవుతుంది అనుకుంటే పొరపాటే. అన్నీ గమనిస్తున్న ప్రజలు సరైన టైమ్ లో చెంపపెట్టులాగా బుద్ది చెప్పే రోజులు వస్తాయనేది గుర్తించుకోవాల్సిన సత్యం. ప్రభుత్వాలు కూల్చుతాం.. అధికారాన్ని లాక్కుంటాం అంటూ ప్రజాస్వామ్యాన్ని కుని చేసే విధంగా వ్యాఖ్యలు చేస్తూ.. దుర్మార్గపు పనులకు శ్రీకారం చూడుతున్నారు కమలనాథులు. ఈ మద్య కాలంలో బీజేపీ నేతలు తెలంగాణలో చేస్తున్న దుర్మార్గపు కుతంత్ర రాజకీయాలు యావత్ దేశ ప్రజలు ఛీ కొట్టే విధంగా ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు..

రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్న కే‌సి‌ఆర్ ప్రభుత్వాన్ని కుల్చేందుకు కాషాయ పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. ఎమ్మెల్యేల కొనుకోలు మొదలుకొని.. తాజాగా ప్రశ్న పాత్రల లీకేజి వరకు ఇలా ఎన్నో దుర్మార్గపు చర్యలకు పాల్పడుతూ రాజకీయ లబ్ది పొందేందుకు చూస్తున్నారు కాషాయ పార్టీ నేతలు. అయితే బీజేపీ చేస్తున్న నీచ రాజకీయాలను అంతే స్థాయిలో సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు సి‌ఎం కే‌సి‌ఆర్. ఆ మద్య ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలొ విడియోలతో సహ బయట పెట్టి బీజేపీ నిజస్వరూపాన్ని బట్టబయలు చేసిన కే‌సి‌ఆర్.. తాజాగా ప్రశ్నాపత్రాల లీకేజి వ్యవహారంలొ కూడా కమలనాథుల హస్తాన్ని పసిగట్టి జైలు కు సాగనంపారు. కాగా ఎన్నికలకు ఇంకా ఆరు నెలలు సమయం ఉండడంతో.. ఈ ఆరు నెలల్లో బిజెపి ఇంకా చాలా అడ్డదారుల్లో దుర్మార్గపు చర్యలకు పాల్పడే అవకాశాలు గట్టిగానే కనిపిస్తున్నాయి. అయితే బీజేపీ చేస్తున్న నీచ రాజకీయాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని కమలనాథులు గుర్తించుకోవాలని రాజకీయ వాదులు హితవు పలుకుతున్నారు.

ఇవి కూడా చదవండి…

కేసీ‌ఆర్ తో డిబేట్ చేసే సత్తా బీజేపీకి ఉందా ?

JAGAN:జగన్ సైలెంట్.. ఆ భయంవల్లేనా ?

SSC Exams:విద్యార్థులకు ఆల్‌ ది బెస్ట్

- Advertisement -