బీజేపీ నేత‌ల‌కు షాకిస్తున్న వెల్కం టూ తెలంగాణ హోర్డింగులు!

49
kcr
- Advertisement -

హైదరాబాద్ నగరంలో జూలై 2 – 3 తేదీల్లో జరగనున్న బీజేపీ కార్యవర్గ సమావేశాలకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి విచ్చేస్తున్న ఆ పార్టీ నాయకులకు నగరంలో ఏర్పాటు చేసిన వినూత్న హోర్డింగులు షాక్ ఇస్తున్నాయి. స్వాగతం చెప్పినట్టే కనిపిస్తున్న ఆ హోర్డింగులు నిజానికి వ్యంగ్యంగా, ఇతర రాష్ట్రాల బీజేపీ నాయకులకు చెంపపెట్టులా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఎనిమిదేళ్లుగా ఎలా పురోగమిస్తుందో, వివిధ రంగాల్లో ఎలా దూసుకొని వెళ్తుందో ఇంగ్లీష్ లో ఏర్పాటు చేసిన హోర్డింగులు వివరిస్తున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ నాయకులకు తెలంగాణ సాధిస్తున్న ప్రగతి మీద అవగాహన కలగడానికి దోహదపడే విధంగా సమాచారం పొందుపరిచారు.

నగరంలో వివిధ ఏర్పాటు చేసిన ఈ హోర్డింగులు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. అదే సమయంలో బీజేపీ నాయకులకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయ్యింది. ఎటు చూసినా తెలంగాణ ప్రగతిని చాటి చెప్పే ఈ హోర్డింగులు తమ జాతీయ నాయకత్వం, ఇతర రాష్ట్రాల నాయకులు చూస్తే తెలంగాణ బీజేపీ పరువు గంగలో కలుస్తుంది అని వారు తలలు పట్టుకుంటున్నారు.

నిజానికి తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఏవీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు కావడం లేదు. అభివృద్ధి సూచీల్లో కూడా తెలంగాణ కన్నా బీజేపీ రాష్ట్రాలు బాగా వెనుకబడి ఉన్నాయి. ఇప్పుడీ హోర్డింగుల ద్వారా ప్రధాని మోడీ నాయకత్వంలో బీజేపీ అగ్ర నాయకత్వానికి మొత్తం రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం షాక్ ఇచ్చినట్టే చెప్పాలి.

వెల్కం టు తెలంగాణ హోర్డింగుల ద్వారా ముఖ్యంగా ఈ క్రింది అంశాలను ప్రస్తావించడం జరిగింది.

  • మిషన్ భగీరత ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరుఅందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
  • దేశంలో ఆర్థిక అభివృద్ధిలో అత్యంత వేగంగా పుంజుకొని నేడు దేశ ఆర్ధిక వ్యవస్థకు తోడ్పాటును అందిస్తున్న రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ నిలిచింది
  • పర్యావరణం హితం కోసం, అడవుల అభివృద్ధిని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరుతో చేపట్టింది.
  • దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో గత ఎనిమిదేళ్లలో ప్రజారోగ్య వ్యవస్థ మెరుగుపర్చడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆసుపత్రుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన చేపట్టింది
  • ఐటీ పురోగతిలో దేశానికే స్పూర్తినిస్తూ తెలంగాణ ముందుకు దూసుకొని వెళ్తోంది
  • ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది
  • జాతీయ స్థాయిలో కేంద్రం ప్రకటించిన అత్యుత్తమ 20 గ్రామాల్లో 19 గ్రామాలు ఒక్క తెలంగాణ రాష్ట్రానికి చెందినవే
  • వరిధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానం తెలంగాణ రాష్ట్రానిది
    తలసరి ఆదాయం విషయంలో దేశంలోనే అత్యంత పురోగతి సాధించిన రాష్ట్రం తెలంగాణ
  • దేశ తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రానిదే అగ్రస్థానం
  • సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ నాల్గవ స్థానంలో ఉంది
  • స్టార్టప్ మరియు ఇన్నోవేషన్ రంగాలకు ప్రోత్సాహం ఇవ్వడానికి ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఇన్నోవేషన్ సెంటర్ తెలంగాణలో ఉంది
  • తెలంగాణ రాష్ట్రం మత సామరస్యానికి, పరమత సహనానికి వేదిక
  • రైతుకు పెట్టుబడి సాయం, రైతు కుటుంబానికి భీమా సౌకర్యం కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
  • దేశంలోనే రైతులకు 24 గంటలు ఉచిత నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుండి ఎలాంటి సహకారం అందనప్పటికీ ఎనిమిదేళ్లలో దేశానికే స్పూర్తినిస్తూ అన్ని రంగాల్లో ఏ విధంగా దూసుకుపోతోందో ఈ హోర్డింగులు ద్వారా తెలియజేయడానికి ప్రయత్నం చేయడాన్ని ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు.

- Advertisement -