అనుకున్నదొక్కటి…అయిందొక్కటి..!

184
bandi sanjay
- Advertisement -

ఏ నేత అయితే పార్టీకి జోష్ నింపుతాడని క్యాడర్ అంతా భావించిందో ఆ నాయకుడి నోటి దురుసుతనం ఫలితం..ఘోర పరాభవం. ఇప్పుడిప్పుడే జాకీలు పెట్టి రీపేర్ చేసిన పువ్వు పార్టీకి అంతలోనే బ్రేక్. రెండు ఎమ్మెల్సీ స్థానాలు…అందులో ఒకటి సిట్టింగ్. రెండింటిలో ఘోర పరాజయంతో కమలం క్యాడరే కాదు నేతలు కూడా ఢీలా పడిపోయారు.

టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం పడిపోతుంది ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన బండి సంజయ్‌ అండ్ బ్యాచ్‌కి పట్టభద్రులే కాదు బీజేపీ ఓటర్లు కొలుకోలేని షాకిచ్చారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ ఓటర్లు కారు గుర్తుకు ఓటేయగా రెండు స్థానాల్లో ఓటమితో బండికి బ్రేక్‌లు పడ్డాయి.

నల్లగొండ స్థానంలో ఘోరంగా ఓడిపోతే,హైదరాబాద్‌లో పరువు పోగోట్టుకున్నారు. కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్లు అతివిశ్వాసం,అధికార పార్టీని తక్కువ అంచనా వేయడం అంతకుమించి బండి సార్ నోటి దురుసుతనం అంతా కమలం పార్టీ ఓటమికి కారణమయ్యాయి. పెద్ద పెద్ద హోటల్స్‌లో సమావేశాలు పెట్టి సమయాన్ని, డబ్బును వృథా చేశారని.. అదే సొమ్మును మరో చోట పెడితే ఇంకోలా ఉండేదని ఆ పార్టీ నేతలు స్వయంగా చెబుతున్నారట.

కొన్ని చోట్ల పార్టీ నేతల మధ్య సమన్వయం లోపించడం, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌,ఎంపీ అరవింద్‌లు ప్రచారంలో ఎక్కడా కనిపించకపోవడంతో అంతర్గత విభేదాలతో పార్టీ ఓటమి పాలైందని నేతలు చెబుతున్నారు. ఓవరాల్‌గా దుబ్బాక,జీహెచ్‌ఎంసీలో మాటల గారడీతో గట్టెక్కిన బండి అండ్ కోకి పట్టభద్రులు ఇచ్చిన షాక్‌ కోలుకోలేని దెబ్బెనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -