బండి సంజయ్‌పై లక్ష్మణ్ షాకింగ్ కామెంట్స్

71
- Advertisement -

బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఎంపీ కే.లక్ష్మణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్టీ ముందు తర్వాతే బండి సంజయ్ అన్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డి అవసరం పార్టీకి ఉంది కాబట్టే అధ్యక్షుడి మార్పు చేపట్టారన్నారు. బండి సంజయ్‌ కంటే కిషన్ రెడ్డి సీనియర్ అన్నారు.

అలాగే బీజేపీ నేత రఘునందన్ పార్టీలో లేని కల్చర్ తీసుకొస్తున్నారని ఆయన పద్దతి మార్చుకోవాలన్నారు. న్యూసెన్స్ చేయడం సరికాదన్నారు. అధ్యక్షుడి మార్పు అనేది నిరంతర ప్రక్రియ అన్నారు. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాలన్నారు. అంకితభావం కలిగిన కార్యకర్తలను పార్టీ గుర్తిస్తుంది అనడానికి తానే ఉదాహరణ అన్నారు.

Also Read:మరోసారి విక్రమ్ కాంబో రిపీట్!

ఈటల రాజేందర్ పార్టీలో కొత్తగా వచ్చిన ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గా నియమించిందన్నారు. పార్టీలో గ్రూపు రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. ఏదైనా ఇబ్బందులు ఉంటే పార్టీ అధిష్టానానికి చెప్పుకోవాలన్నారు. అయితే రఘునందన్ బాహాటంగా మాట్లాడటం సరికాదన్నారు. బీజేపీలో అసంతృప్తి పెరగాలని చాలామంది కోరుకుంటున్నారని అవేమీ పనిచేయవన్నారు. కాంగ్రెస్ నేతలు ఎన్ని విన్యాసాలు చేసిన ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు.

- Advertisement -