ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జనసేనకు సంబంధించి రోజుకొక హాట్ టాపిక్ తెరపైకి వస్తోంది. నిన్న మొన్నటి వరకు వైసీపీ జనసేన మద్య పోలిటికల్ హిట్ ఏ స్థాయిలో ఉండిందో అందరం చూశాం. అయితే వైసీపీ వర్సస్ జనసేన రాజకీయం ఎప్పుడు ఉండేదే అయినప్పటికి.. ఇప్పుడు తాజాగా జనసేన మిత్రపక్షం బీజేపీకి సంబంధించి హాట్ హాట్ డిబేట్లు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇటీవల చంద్రబాబుతో పవన్ భేటీ అయ్యారు. దాంతో బీజేపీకీ కొత్త అనుమానాలు పట్టుకున్నాయి. పవన్ బీజేపీకి దూరం అవుతున్నారా ? పవన్ బీజేపీ కంటే టీడీపీ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారా ? ఇలాంటి ప్రశ్నలు పోలిటికల్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తున్నాయి. .
జనసేన మొదటి నుంచి కూడా బీజేపీ మిత్రపక్షంగా ఉన్నప్పటికి అది నామమాత్రమే అనే వాదన రాజకీయ వర్గాల్లో బగ్తా వినిపిస్తోంది. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర నాయకులతో పవన్ పెద్దగా కలిసింది లేదు.. అలాగే బీజేపీతో కలిసి ఎలాంటి వ్యూహరచన చేసింది లేదు. పవన్ ఒంటరిగానే ప్రజల్లోకి వెళుతూ పార్టీ బలం పెంచుకునే పనిలో ఉన్నారు. అయితే బీజేపీ మాత్రం పవన్ తోనే తమ పొత్తు అని, వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి బరిలోకి దిగుతామని చెబుతోంది. అయితే పవన్ మాత్రం బీజేపీ కంటే టీడీపీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు అర్థమౌతోంది. ఆ మద్య విశాఖా టూర్ లో పవన్ తో చంద్రబాబు భేటీ కావడం.. మళ్ళీ ఇప్పుడు బాబుతో పవన్ సమావేశం కావడం.. ఇవన్నీ చూస్తుంటే పవన్ బీజేపీతో తెగతెంపులు చేసుకొని టీడీపీతో పొత్తుకు సై అంటారనే వార్తలు పోలిటికల్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో బీజేపీకి ఏమాత్రం బలం లేదు.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని చూస్తున్న పవన్.. మొదట త్రిముఖ పొత్తును ఆశించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి 2014 కూటమిని రిపీట్ చేయాలని భావించారు అయితే బీజేపీ మాత్రం టీడీపీతో కలవడానికి ఆసక్తి చూపడంలేదు. దీంతో పవన్ మద్యస్థంగా ఉండడం కంటే ఏదో ఒక పార్టీతో స్థిరమైన పొత్తు కొనసాగిస్తే ఎన్నికల్లో సత్తా చాటవచ్చని పవన్ ఆలోచనగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బలంలేని బీజేపీకంటే బలమైన టీడీపీతోనే దోస్తీ బెటర్ అనే భావనకు పవన్ వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలనివ్వబోమని చెబుతున్న పవన్.. అందుకోసం పొత్తుకు సై అనే సంకేతాలను స్పష్టంగా పంపారు. కాగా ప్రస్తుతం పవన్ వైఖరి చూస్తుంటే టీడీపీకి దగ్గరవుతూ.. బీజేపీకి దూరం అవుతున్నట్లే తెలుస్తోంది. ఒకవేళ పవన్ బీజేపీ దోస్తీకి గుడ్ బై చెబితే.. కమలం పార్టీకి పెద్ద ఎదురుదేబ్బే అని చెప్పవచ్చు. పవన్ అండతోనే ఏపీలో బలపడాలని చూస్తూన్న కాషాయ పార్టీకి పవన్ దూరమైతే ఉనికే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. మరి కమలం పార్టీ పవన్ ను వదులుకునేందుకు సిద్దమౌతుందా లేదా అనేది చూడాలి.
ఇవి కూడా చదవండి..