‘రాజ్యాంగం రద్దు’.. బీజేపీ ప్రయత్నమదేనా?

8
- Advertisement -

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది దేశ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కేంద్రంలో అధికారం కోసం కాంగ్రెస్ బీజేపీ పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యం ఇరు పార్టీలు చేసుకుంటున్న పరస్పర విమర్శలు కొత్త చర్చలకు తావిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కుటుంబ పాలన సాగుతుందని బీజేపీ విమర్శిస్తుంటే.. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసి నియంత పాలన సాగిస్తుందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. అయితే ఈ విమర్శలలో రాజ్యాంగం రద్దు అనేది హాట్ టాపిక్ అవుతోంది. నిజంగానే బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు సిద్దమౌతుందా ? అందుకే 400 సీట్లను టార్గెట్ గా పెట్టుకుందా? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు సాధించాలని ఓవరాల్ గా ఎన్డీయే కూటమికి 400 సీట్లు రావాలని కమలనాథులు టార్గెట్ గా పెట్టుకున్నారు. .

మోడీ, అమిత్ షా వంటి వారు సైతం ప్రచారాల్లో ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నారు. ఇంతకీ ఈ టార్గెట్ ఎందుకోసమంటే 545 అసెంబ్లీ స్థానాలు ఉన్న మన దేశంలో నాలుగింట మూడో వంతు సీట్లను ఎన్డీయే కూటమి సాధిస్తే రాజ్యాంగంలో ఎలాంటి మార్పులు చేయడానికైనా అధికారం లభిస్తుంది అందుకే తమ టార్గెట్ 400 సీట్లు అంటూ బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారని విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగం రద్దుపై వస్తున్న విమర్శలపై తాజాగా మోడీ స్పందించారు. సబర్మతి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన రాజ్యాంగాన్ని రద్దు చేసే అవకాశం లేదని, అంబేద్కర్ తిరిగి వచ్చిన రాజ్యాంగాన్ని రద్దు చేయలేరని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేయకపోయిన కీలక మార్పులకు మాత్రం బీజేపీ ప్రయత్నించే అవకాశం ఉందనేది కొందరి అభిప్రాయం. మరి ఈసారి ఎన్నికల్లో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి.

Also Read:ఉదయాన్నే తలనొప్పి వస్తే..ఇలా చేయండి!

- Advertisement -