చిరు చుట్టూ బీజేపీ.. ఏంటి ప్లాన్ ?

16
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటేందుకు బీజేపీ కొత్త వ్యూహాలను అమలు చేస్తుందా ? ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవికి అధిక ప్రాధాన్యం ఇస్తోందా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఈమధ్య మెగా ఫ్యామిలీ విషయంలో ప్రత్యేక ప్రేమ కనబరుస్తున్నారు కాషాయ పెద్దలు. జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని పవన్ కు దగ్గరవడం, మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వరించేలా చేయడం వంటివి చేస్తూ వస్తున్నారు. సడన్ గా కమలనాధులు మెగా ఫ్యామిలీ పై దృష్టి పెట్టడానికి కారణం కూడా లేకపోలేదు. ఈ ఏడాది లోక్సభ ఎన్నికలతో పాటు ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి.

ముఖ్యంగా ఏపీలో బలపడాలని బీజేపీ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే జనసేన పార్టీతో దోస్తీ కట్టింది. అయితే ప్రస్తుతం పవన్ బీజేపీ కంటే టీడీపీకే అధిక ప్రాధాన్యమిస్తూ ఉండటంతో చిరంజీవిని రంగంలోకి దించే ప్రయత్నం చేస్తుంది కాషాయ పార్టీ. చిరును రాజకీయంగా తిరిగి యాక్టివ్ చేసేందుకు కమలనాథులు గత కొన్నాళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. గతంలో రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సీటును చిరంజీవికి ఇచ్చే ప్రయత్నం చేసిన ఆ ఆఫర్ ను చిరు తిరస్కరించడంతో కొన్నాళ్ళు సైలెంట్ అయ్యారు కాషాయ పెద్దలు. ఇక ఇప్పుడు మరోసారి చిరుకు రాజ్యసభ సీటు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందట బీజేపీ పార్టీ. 15 రాష్ట్రాల్లో 59 రాజ్యసభ సీట్లకు గాను ఇటీవల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడేసి సీట్ల చొప్పున ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో రెండు స్థానాలు కాంగ్రెస్, ఒక స్థానం బిఆర్ఎస్ సొంతం కానున్నాయి. ఏపీలో మూడు స్థానాలు కూడా అధికార వైసీపీ సొంతం చేసుకునే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీకి అవకాశం లేనందున ఉత్తరప్రదేశ్ నుండి పది స్థానాల్లో ఒక రాజ్యసభ సీటును చిరు కోసం కేటాయించి ఆలోచనలో ఉన్నారట బీజేపీ పెద్దలు. ఈ ఆఫర్ కు చిరు అంగీకరిస్తే పూర్తిస్థాయిలో బీజేపీ నేతగా కాషాయ పార్టీలో స్థానం దక్కే అవకాశం లేకపోలేదు. పైగా చిరంజీవి బీజేపీలో చేరితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కాషాయ పార్టీకి మంచి మైలేజ్ ఏర్పడుతుంది. అందుకే ఎలాగైనా చిరును పాలిటిక్స్ లో యాక్టివ్ చేసేందుకు బీజేపీ పెద్దలు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. మరి రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి తిరిగి యాక్టివ్ అవుతారేమో చూడాలి.

Also Read:Harishrao:ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు?

- Advertisement -