మైక్రోసాఫ్ట్‌ నుంచి పూర్తిగా తప్పుకున్న బిల్ గేట్స్‌..

322
bill gates
- Advertisement -

మైక్రోసాఫ్ట్‌ వ్యవస్ధాపకుడు,ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్‌ మైక్రోసాఫ్ట్‌ సంస్థకు రాజీనామా చేశారు. ప్రస్తుతం బోర్డు సలహాదారుడిగా ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీంతో పాటు బెర్క్‌ షైర్ హాత్ వే పబ్లిక్ బోర్డు నుంచి కూడా తప్పుకున్నారు. ఇకపై తాను పూర్తిస్ధాయిలో సామాజిక సేవా కార్యక్రమాలకే పరిమితం అవుతానని..మైక్రోసాఫ్ట్ ఎప్పడూ లేనంతగా పటిష్టంగా ఉంది అందుకే ఇదే సరైన సమయం అని ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఇప్పటికే బిల్  – మిలిందా గేట్స్  ఫౌండేషన్ ద్వారా సేవలందిస్తున్నారు.

1975లో మైక్రోసాఫ్ట్‌ను ప్రారంభించిన ఆయన దాన్ని ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌ స్థాయికి తీసుకెళ్లారు. సామాజిక బాధ్యతతో ప్రపంచవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.2000 సంవత్సరంలో సీఈఓ పదవికి రాజీనామా చేసిన ఆయన 2008నుంచి ఫుల్‌టైం పనికి కూడా గుడ్‌బై చెప్పారు. 2014లో మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌ పదవి నుంచి వైదొలిగారు.

- Advertisement -