వింగ్స్ ఇండియా 2020 ..అవార్డులు అందజేసిన కేటీఆర్

241
ktr
- Advertisement -

వింగ్స్ ఇండియా 2020లో భాగంగా ఎయిర్ షోలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన కంపెనీలకు అవార్డులను అందజేశారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. వింగ్స్ ఇండియా ద్వారా బెస్ట్ ఎయిర్ లైన్ అవార్డు చండిఘర్ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్,బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌ పోర్టు దక్కగా బెస్ట్ డొమెస్టిక్ అవార్డు విస్తార ఎయిర్ లైన్,వెంచురా ఎయిర్ కనెక్ట్‌లకు దక్కింది.

బెస్ట్ ఉడాన్ అవార్డు హుబ్బలి ఎయిర్‌పోర్టుకు దక్కగా బెస్ట్ ఎయిర్ కార్గో సర్వీస్ ప్రొవైడర్ అవార్డ్ ఢిల్లీ ఎయిర్ లైన్స్‌ను వరించింది. స్పెషల్ కేటగిరీ అవార్డ్ కింద మోస్ట్ డెడికేటెడ్ ఔట్ లుక్ ఫార్ ఎయిరో స్పెస్ ఇండస్ట్రీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కగా ఈ అవార్డును అందజేశారు కేటీఆర్. అవార్డు విన్నర్స్ కు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్..తెలంగాణ ప్రభుత్వానికి అవార్డు రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.

- Advertisement -