చాట్‌ జీపీటీ… సృష్టికర్తపై వేటు

41
- Advertisement -

చాట్ జీపీటీ…ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక దీని సృష్టికర్త శామ్ ఆల్ట్‌మన్‌. త్వరలోనే తెలుగులో కూడా చాట్ జీపీటీని తీసుకొచ్చే ప్లాన్ చేస్తుండగా తాజాగా ఆ కంపెనీ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. శామ్ ఆల్ట్‌మన్‌పై వేటు వేసింది. ప్రస్తుతం కంపెనీ సీఈవోగా ఉన్న ఆయన్ని ఆ దపవి నుం డి తొలగించింది.

శామ్‌ స్థానంలో కంపెనీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్న మిరా మురాటీని సీఈవోగా నియమించింది. బోర్డుతో జరుగుతున్న అంతర్గత చర్చల్లో ఆల్ట్‌మెన్‌ నిజాయితీ పాటించడం లేదని, సరైన సమాచారం పంచుకోవడం లేదని ఓపెన్‌ఏఐ వెల్లడించింది. ఓపెన్‌ఏఐకి నాయకత్వం వహించే అతని సామర్థ్యంపై తమకు ఏమాత్రం నమ్మకం లేదని తెలిపింది.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే చాట్‌జీపీటీని మైక్రోసాఫ్ట్‌ ఓపెన్‌ఏఐ 2015లో అభివృద్ధి చేసింది. స్పేస్‌ఎక్స్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌తో కలిసి శామ్ ఆల్ట్‌మెన్‌ దీనిని రూపొందించారు. 2018లో ఈ కంపెనీ నుంచి మస్క్‌ తప్పుకున్నారు. లాంఛ్ అయిన రెండునెలల్లోనే చాట్‌జీపీటీ 10 కోట్ల యూజ‌ర్లను చేరుకుంది.

Also Read:Bigg Boss 7 Telugu:అసలు శివాజీ బయటికొచ్చేశాడు

- Advertisement -