రోహిత్ – ఆదిరెడ్డి ఎమోషన్!

298
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 101 రోజులు పూర్తి చేసుకుంది. మరికొద్దిరోజుల్లో ఈ సీజన్ ముగియనుండగా టాప్ 5 కంటెస్టెంట్స్ జర్నీని చూపించి వారిని ఎమోషన్‌కి గురి చేశారు బిగ్ బాస్. ఆదిరెడ్డి జర్నీని చూపించి తన భార్య కవిత ఫోన్ చేయడంతో ఆమెతో మాట్లాడాడు. హాయ్ ఆది.. మేమంతా బాగున్నాం.. నీ కల నెరవేరడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నావ్.. ఒక కామన్ మెన్ తలుచుకుంటే.. ఏదైనా సాధించగలడని మళ్లీ నిరూపించబోతున్నావ్.. నీకోసం మన ఫ్యామిలీ.. మన అభిమానులు అంతా కప్పు తీసుకుని వస్తున్నావని ఎదురు చూస్తున్నాం అని తెలపగా ఎమోషనల్ అయ్యారు ఆదిరెడ్డి.

అనంతరం ఆదిరెడ్డి గురించి బిగ్ బాస్ మాట్లాడుతూ..ఒక సామాన్యుడిగా ఆసక్తితో బిగ్ బాస్ రివ్యూవర్‌గా ఇప్పుడు కంటెస్టెంట్‌గా మీ ప్రయాణం ఈ చివరి వారానికి చేరింది. ఇంట్లోకి రాకముందే.. ఆట గురించి ఎన్నో లెక్కలు వేసి.. ఇంట్లోకి అడుగుపెట్టగానే మీలోని స్ట్రాటజీ మాస్టర్ చురుకయ్యారు అని తెలిపారు. మీలోని రివ్యూవర్‌ని కాకుండా ఒక సామాన్యుడ్ని కొన్ని సార్లు బయటపెట్టారు. అది అందరినీ ఆకట్టుకుంది. సామాన్యుడిగా మొదలై విజేతగా నిలిచేందుకు ఒక అడుగు దూరంలో ఉన్న మీ ప్రయాణం కూడా ఆగకూడదని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

తర్వాత రోహిత్ జర్నీని చూపించారు బిగ్ బాస్. అనంతరం తన భార్య మెరీనా ఫోన్ కాల్ ద్వారా.. అద్భుతంగా మాట్లాడి అతనిలో ధైర్యం నింపింది. రోహిత్ గురించి బిగ్ బాస్ చాలా అద్భుతంగా చెప్పారు. రోహిత్.. మొసలి నీటితో తన బలాన్ని స్వేచ్ఛగా ప్రదర్శిస్తుంది. అదే నేలపై ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి ఆలోచిస్తుంది. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి.. ఏదైనా సాధించడానికి ధైర్యం కావాలి. అదే ధైర్యాన్ని చూపిస్తూ మీరు ప్రదర్శించిన స్పూర్తి అద్భుతం అన్నారు.ఎక్కడ నుంచి వచ్చాం అనేది కాదు.. వచ్చి ఏం సాధించాం అనేది ముఖ్యం.. 14 వారాల ప్రయాణం విజవంతంగా పూర్తి చేసుకుని.. విజయానికి ఒక్క అడుగు దూరంలో ఉన్న మీకు భాషా భేదాలన్నీ దాటుకుని మిమ్మల్ని ఇష్టపడే.. ఎంతమంది ప్రేమని సంపాదించారో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుందని భావిస్తున్నారు అంటూ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -