BB6…రేవంత్ వర్సెస్ ఫైమా

104
bb6
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 85 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా ఎలిమినేషన్ ప్రక్రియ వాడివేడిగా సాగింది. రేవంత్- ఆదిరెడ్డి, రేవంత్ – ఫైమా మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

బంగారుతల్లీ అని రేవంత్‌ని ఉద్దేశించి ఆదిరెడ్డి అంటే.. నేను తల్లిని కాదు.. తండ్రిని అని అన్నాడు.. నవ్వు తల్లో తండ్రో.. ఏదోటి వేసుకోగానీ అంటూ ఇచ్చిపడేశాడు ఆదిరెడ్డి. నేను చేసిన తప్పుని యాక్సెప్ట్ చేసే ధైర్యం నా దగ్గర ఉంది.. అది నీ దగ్గర లేదు అని రేవంత్‌పై మండిపడ్డారు ఆదిరెడ్డి. ధైర్యం గురించి నా దగ్గర మాట్లాడకు అని రేవంత్ అనగా నువ్ మాట్లాడొద్దంటే మాట్లాడను.. మాట్లాడతా అని ఇద్దరు ఒకరికి ఒకరు రెచ్చిపోయారు.

తర్వాత రేవంత్ – ఫైమా మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వేరే వాడి సపోర్ట్ లేనిదే నువ్ గేమ్ ఆడలేవ్.. నువ్ నాకు చెప్తున్నావ్ అని రేవంత్ అనడంతో.. ఫైమా ఆవేశం కట్టలు తెంచుకుంది. నేను సపోర్ట్ లేకుండా ఆడలేనన్నావ్.. నువ్ సపోర్ట్ లేకుండా ఆడావా? అని అరుస్తూ వేలు చూపించింది. దీంతో రేవంత్ నాకు వేలు చూపించి మాట్లాడకు.. హే… వేలు చూపించకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేయగా ఫైమా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.

సపోర్ట్‌తో ఆడిన రేవంత్.. సపోర్ట్ గురించి మాట్లాడుతున్నాడు.. మాటలు మారుస్తూ ఉంటాడు.. ఇక్కడొక మాట.. అక్కడొక మాట.. కీర్తీ నువ్ సూపర్ ఆడతావ్ అంటాడు.. మళ్లీ అక్కడికి వెళ్లి.. కీర్తి ఆడనే ఆడదని అంటాడు అంటూ గట్టిగానే అడిగింది ఫైమా.

ఇవి కూడా చదవండి..

- Advertisement -