ఇది రికార్డు అంటే..ఒకే ఓవర్లో ఏడు సిక్స్‌లు

257
gaikwad
- Advertisement -

రికార్డు అంటే ఇదే..ఒకే ఓవర్‌లో ఏడు సిక్స్‌లు బాధి రికార్డు సృష్టించారు టీమిండియా యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్. విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్స్ ఫైనల్స్‌లో భాగంగా ఉత్తర్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర ఓపెనర్‌గా బరిలోకి దిగిన గైక్వాడ్ ఈ ఘనత సాధించాడు. సోమవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శివ సింగ్ వేసిన ఇన్నింగ్స్ 49వ ఓవర్‌లో ఈ అద్భుతం చోటు చేసుకుంది.

గైక్వాడ్ దెబ్బకు యూపీ బౌలర్ ఒకే ఓవర్లో 43 పరుగులు ఇచ్చారు. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ డబుల్ సెంచరీతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 16 సిక్సులు, 10 ఫోర్లు బాదిన గైక్వాడ్ 159 బంతుల్లో 220 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. గైక్వాడ్ దెబ్బకు విలవిల్లాడిన బౌలర్ శివ 9 ఓవర్లలో ఒక వికెట్ కూడా తీయకుండానే 88 పరుగులు ఇచ్చుకున్నాడు.

- Advertisement -