BB6..శ్రీహాన్‌,శ్రీసత్యను ఆడుకున్న ఆడియన్స్!

134
srihan
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 75 రోజులు పూర్తి చేసుకుంది. ఈ వారం కెప్టెన్ ఫైమా తప్ప అంతా ఎలిమినేషన్స్‌లో ఉండగా తాజా ఎపిసోడ్‌లో భాగంగా శ్రీసత్య, శ్రీహాన్ గాలితీసేశారు ఆడియన్స్‌.

మొదటిగా శ్రీహాన్‌కి.. కీర్తి విషయంలో ఎనిమిది వారాలుగా రూడ్‌గా ఉన్నారు. కుకింగ్ నేర్చుకుని చెయ్యమని చెప్పారు.. కానీ కన్వినెంట్‌గా మీ ఫ్రెండ్ శ్రీసత్యకి కుకింగ్ చేయను అని చెప్పినప్పుడు అదే విషయం చెప్పలేదు ఎందుకు? అని అడిగారు. దీంతో సరైన సమాధానం చెప్పలేక దాటవేసే ప్రయత్నం చేశారు. తనకు గుర్తు ఉన్నంత వరకూ శ్రీసత్య మొత్తం కుకింగ్‌లో లేకుండా అయితే లేదు. సో నా కెప్టెన్సీలోకి వచ్చేసరికి కిచెన్‌లో ఎవరైతే కనిపించలేదో వాళ్లని మెయిన్‌గా కుకింగ్‌లో వెయ్యాలనేది నా పాయింట్ అని కవర్ చేశారు. శ్రీహాన్ సమాధానం చెప్పలేక మాటజారే ప్రయత్నం చేయగా కీర్తి సంబురపడిపోయింది.

తర్వాత శ్రీసత్య వంతురాగా మీరు ఫ్రెండ్స్‌ని నామినేట్ చేయొచ్చు.. ఫ్రెండ్స్‌ని మోసం చేయొచ్చు.. కానీ ఇనయాని వెన్నుపోటు అని చెప్పారు కానీ.. మీరు రేవత్‌ని మూడు సార్లు నామినేట్ చేశారు దీనిపై ప్రశ్నించగా …ఎస్ తప్పనిసరిగా పాటిస్తాను.. ఇక్కడ ఫ్రెండ్‌ని నామినేట్ చేయకూడదు అని ఏం లేదు.. ఒకవేళ తప్పు ఉంటే నేను ఎవరినైనా నామినేట్ చేస్తాను అని తెలిపింది. ఇక ఆడియన్స్ అడిగిన ప్రశ్నలకు అన్ని అబద్దాలే చెప్పింది శ్రీసత్య.

ఇవి కూడా చదవండి..

- Advertisement -