బిగ్ బాస్ 4 రద్దు…పుకార్లే..!

355
big boss 4 telugu
- Advertisement -

బిగ్ బాస్ సీజన్‌ 4కి రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు సక్సెస్ ఫుల్‌గా 3 సీజన్లను కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్…4వ సీజన్‌ను త్వరలోనే ప్రారంభించనుంది. వాస్తవానికి బిగ్ బాస్ 4కి సంబంధించి ఏర్పాట్లు ఏప్రిల్ నుండే ప్రారభం కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా వాయిదా పడుతూవస్తున్నాయి.

అయితే కరోనా కారణంగా బిగ్ బాస్ సీజన్ 4 వాయిదా పడిందన్న వార్తలు వెలువడుతుండగా అవన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు నిర్వాహకులు. ఆగస్టు నుండి బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 4ని ప్రారంభించనున్నట్లు సమాచారం.

సీజన్ 1కి ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించగా తర్వాత నాని, నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇక ఈసారి కూడా నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం.

- Advertisement -