బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు విజయవంతంగా 87 రోజులు పూర్తి చేసుకుంది. ఇక తాజా ఎపిసోడ్‌లో భాగంగా తొలి ఫైనలిస్ట్ కోసం జరిగిన ఫినాలే అస్త్ర రసవత్తరంగా సాగింది. ఇక తను ఫినాలే అస్త్ర నుండి తప్పించడంతో శోభ మైండ్ బ్లాంక్ అయింది.
ఇక తర్వాత ఫినాలే అస్త్ర టాస్క్‌లో భాగంగా గేమ్‌లో మిగిలిన ఆరుగురికి ఎత్తర జెండా అనే టాస్క్ ఇచ్చారు. వారికి కేటాయించిన పడవని ఇసుకతో నింపి.. పడవ ముందు భాగం పైకి లేచేట్టు చేయాలి. ఈ టాస్క్‌కి శివాజీ, శోభాశెట్టిలు సంచాలకులుగా వ్యవహరిస్తారని చెప్పారు బిగ్ బాస్. గౌతమ్ తన స్ట్రాటజీ ఉపయోగించి పడవ ముందు భాగంలో ఉన్న ఇసుకతో నింపే ప్రయత్నం చేశాడు. అయితే సంచాలక్‌గా ఉన్న వాళ్లు ఫౌల్ గేమ్ అని అనడంతో.. రూల్స్ బుక్ చదవండి అని అన్నాడు గౌతమ్. అయితే బిగ్ బాస్ కల్పించుకుని ఫౌల్ గేమ్ అని ప్రకటించి వేసిన ఇసుక మొత్తాన్ని వెనక్కి తీయించారు బిగ్ బాస్.
ఇక ఈ టాస్క్‌లో తన ఫోకస్ మొత్తం ప్రశాంత్‌పైనే పెట్టింది శోభ. ప్రశాంత్ రెండు చేతులు పెడుతున్నాడు ఔట్ అనగా అందరూ పట్టుకుంటున్నారమ్మా అని శివాజీ అనడంతో రెండో హ్యాండ్ పట్టుకోవడానికి వీళ్లేదని చెప్పింది. మళ్లీ ప్రశాంత్‌నే టార్గెట్ చేస్తూ ఫుల్‌గా నింపుకుని వెళ్లు అని కొత్త రూల్స్ పెట్టింది.శివాజీ వారిస్తున్న వినలేదు. అయితే ప్రశాంత్‌ని ఎంత టార్గెట్ చేసినా చివరకు రైతు బిడ్డే గెలిచాడు. అందరికంటే ముందుగా పడవలో ఇసుకను నింపాడు.
ప్రశాంత్ తర్వాత యావర్, అర్జున్, అమర్, గౌతమ్‌లు తమ పడవలను ఇసుకతో నింపారు. అయితే అందరికంటే లాస్ట్‌లో ప్రియాంక తన పడవను ఇసుకతో నింపి చివర్లో గంట కొట్టింది. ఈ టాస్క్‌లో గెలిచిన ప్రశాంత్‌కి 100 పాయింట్లు రాగా యావర్ 90, అర్జున్ 80, అమర్ 70, గౌతమ్ 60, ప్రియాంక 50 పాయింట్లను సాధించింది.
Also Read:ఓటర్లు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి !