బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు విజయవంతంగా 86 రోజులు పూర్తి చేసుకుంది. ఇక సోమవారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తికావడంతో తనను నామినేట్ చేసిన గౌతమ్, అర్జున్‌ల గురించి ఎమోషనల్ అయ్యారు శివాజీ. ప్రశాంత్‌తో మాట్లాడుతూ.. నేను వెళ్లిపోవాల్సిందిరా.. ఈ టార్చర్ భరించలేకపోతున్నాను.. వాడెవడ్రా (గౌతమ్) అసలు ప్రతివారం వా డు కావాలనే గొడవ పడుతున్నాడన్నారు. వాడు చెప్పేవన్నీ అబద్దాలే..వాడిని నేను ఆపుతున్నానని అంటున్నాడు. నేనేం ఆపుతున్నారా?? నేను ఆపితే 12 వారాలు ఉంటాడా?? ఇంత ఆలోచించడం లేదన్నారు. అర్జున్ అతి తెలివితేటలు ఏంటో నాకు అర్ధం కావడం లేదు. ప్రేమగా దగ్గరగా ఉంటే పొడుస్తారు. ఆ అమర్ గాడు అయితే నేను దొంగాటలు ఆడానని అన్నాడు.. ఏంట్రా వీళ్లంతా అని బాధపడిపోయాడు.
శివాజీ మరో అడుగు ముందుకేసి తనని ఎలిమినేట్ చేసేయమని జనాన్ని దండం పెట్టి వేడుకున్నాడు. ఆ తర్వాత అమర్ దీప్, శోభాశెట్టిలు నిన్నటి నామినేషన్స్ గురించే మాట్లాడుకున్నారు. ఏంట్రా వీళ్లూ.. ఇంతకు ముందు ఎప్పుడూ నామినేషన్ జరగనట్టు.. వీళ్లెప్పుడూ ఎవర్నీ నామినేట్ చేయనట్టూ మాట్లాడుతున్నారు?? అని అమర్ ముందు ఎటకారంగా మాట్లాడింది శోభ. దీంతో అమర్.. నేను ప్రశాంత్‌ని నామినేట్ చేసినందుకు ఫీల్ అయిపోతున్నాడు.. నేను ఆలోచించి మంచిగానే చేశాను అని చెప్పాడు.
నామినేట్ చేస్తే నమ్మకద్రోహం చేసినట్టు కాదు. వెన్నుపోటు కాదూ.. మోసం చేయడమూ కాదు.. అది ప్రాసెస్ మాత్రమే అంటూ చెప్పాడు అమర్ దీప్. తనని కెప్టెన్‌ని చేయలేదని.. నామినేషన్ చేశారని…. కెప్టెన్సీ రేస్ నుంచి తీసేశారని బాధపడ్డాడు. తర్వాత వాకింగ్ చేస్తూ శోభకు దిమ్మతిరిగి పోయే పంచ్ ఇచ్చాడు శివాజీ. ఏమ్మా పెయిన్స్ ఏమైనా వస్తున్నాయా? అని అడిగాడు. పక్కనే ఉన్న అమర్ కల్పించుకుని లేదన్నా బాగా కాలుతుంది అని అంతేవెటకారంగా కౌంటర్ ఇచ్చాడు. ఇంతలో శోభ.. నోటికి పనిచెప్పింది. శివాజీ వయసు గురించి ఇన్ డైరెక్ట్‌గా మాట్లాడుతూ ,…లేదన్నా.. నొప్పులు అనేవి.. ఏజ్ పెరిగే కొద్దీ వస్తాయని విన్నానులే.. మీరేమంటారు ? అని అనగా శివాజీ.. లోపల బుర్రలో చెత్త ఉంటే అలా వస్తుందిలే అని గాలి తేసేశారు శివాజీ.
Also Read:BJP:కమలం పార్టీ రంగు బయటపడిందా?