Bigg Boss 7 Telugu:ప్రశాంత్ చేతికి ఎవిక్షన్ పాస్

62
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు విజయవంతంగా 79 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా శివాజీ – ప్రియాంకల మధ్య రచ్చ జరుగగా రైతు బిడ్డ ప్రశాంత్ ఎవిక్షన్ పాస్‌ను గెలుచుకున్నారు. మంగళవారం నామినేషన్స్ సందర్భంగా శివాజీ తొలుత గౌతమ్‌ని నామినేట్ చేయగా తర్వాత డైరెక్ట్ నామినేట్ అయిపోయిన అశ్వినీని నామినేట్ చేశాడు శివాజీ. కానీ ఇది కుదరదని బిగ్‌బాస్ చెప్పడంతో అర్జున్‌కి వేశాడు. శివాజీ నామినేషన్‌కి తన పేరు చెప్పడంతో ఏడుపు మొదలెట్టేసింది.

నేను శివన్నను నామినేట్ చేద్దామనుకున్నాను కానీ చేయలేదు.. మా మమ్మీ చెప్పింది శివన్న పెద్దోడు.. గొడవ పెట్టుకోవద్దని అంటూ శోభాకి చెప్పి బాధ పడింది. శోభా ఓదారుస్తూ శివాజీ గురించి చెప్పి రెచ్చగొట్టింది. ఏజ్‌కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ శివన్న కూడా మన కో కంటెస్టెంట్ మనం నామినేట్ చేయాల్సిందే అని చెప్పింది. తర్వాత రతికతో శివాజీ గురించి చాడీలు చెప్పాడు అర్జున్.

తర్వాత యావర్.. అమర్‌ని ,అర్జున్‌ని నామినేట్ చేయగా తర్వాత సైలెంట్‌గా వచ్చి శివాజీని నామినేట్ చేసింది శోభా. మీరు ఒకసారి ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటివరకు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అదే జరుగుతుందమ్మా.. కానివ్వు కానివ్వు అన్నారు. సెకండ్ నామినేషన్ అర్జున్‌కి వేసింది శోభా. తర్వాత ప్రియాంక వచ్చి యావర్‌ని నామినేట్ చేసింది. రాజమాతల విషయంలో ఫేవరిజం అన్నావ్ కదా అది ఎందుకు అని చెప్పు.. అని ప్రియాంక అడిగింది. తర్వాత శివాజీని నామినేట్ చేసింది ప్రియాంక.

Also Read:మరో రెండేళ్లు కెప్టెన్ గా రోహిత్ శర్మ?

తర్వాత బిగ్‌బాస్ ఎవిక్షన్ పాస్ కోసం ఓ టాస్కు పెట్టాడు. ఇది బిగ్‌బాస్ చరిత్రలో మొదటిసారి జరుగుతుంది.. ఎవిక్షన్ పోటీ ముగిసిన తర్వాత కూడా ఇది ఎవరి సొంతం కాలేదు.. కనుక ఇంటి సభ్యులు అందరి కోసం ఒక ఫైనల్ టాస్క్.. పెడుతున్నాం అని చెప్పాడు. ఒక్కో కంటెస్టెంట్‌కి బ్యాలెన్సింగ్ రాడ్ ఇస్తారు. స్టార్ట్ బజర్ మోగిన తర్వాత కంటెండర్స్ బ్యాలెన్సింగ్ రాడ్‌ ఒక ఎండ్‌ని ఒక చేత్తో పట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత బిగ్‌బాస్ చెబుతున్న ఒక్కో వస్తువును దానిపై పెట్టి కింద పడకుండా ఎక్కువసేపు ఎవరు బ్యాలెన్స్ చేస్తారో వాళ్లే విన్నర్ అని తెలపగా ఈ టాస్క్‌లో ప్రశాంత్ గెలిచాడు. తర్వాత శివాజీ..ప్రశాంత్‌ను హత్తుకొని నువ్వు గాడ్ గిఫ్టెట్ బాయ్ రా.. నా నమ్మకం నిలబెట్టావ్.. అన్నీ ఉన్న ఆకు ఎప్పుడూ అణిగిమణిగే ఉంటదిరా.. ఏమీ లేని ఆకే ఎగిరెగిరి పడతా ఉంటది.. వాటి గురుంచి పట్టించుకోకు అంటూ హితబోధ చేశాడు.

Also Read:‘సైంధవ్’..ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్

- Advertisement -