Bigg Boss 7 Telugu:ప్రియాంకకు సర్‌ప్రైజ్ ఇచ్చిన శివ

10
- Advertisement -

బిగ్‌బాస్ సీజన్-7లో ఫ్యామిలీ వీక్ చాలా ఎమోషనల్‌గా సాగిపోతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్‌లో హౌస్‌లోకి ప్రియాంక జైన్ లవర్ శివకుమార్ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చీ రావడంతోనే ప్రతి ఒక్కరికీ బిస్కెట్లు వేసుకుంటూ వెళ్లిపోయాడు. కానీ తన ప్రియురాలికి మాత్రం బంగారంలాంటి సలహాలు ఇచ్చాడు.

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ 66 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా కంటెస్టెంట్స్ ఫ్యామిలీ ఎంట్రెన్స్ ఎపిసోడ్ కొనసాగింది. ఫ్యామిలీ వీక్‌లో భాగంగా ప్రియాంక లవర్ శివకుమార్ తొలుత ఎంట్రీ ఇచ్చాడు. వచ్చీ రాగానే ప్రియాంకను హత్తుకొని ముద్దులతో ముంచెత్తాడు. మోకాళ్ల మీద నిల్చొని రోజా పువ్వు ఇచ్చి చేతిని కిస్ చేశాడు. మిస్ యూ అంటూ ప్రియాంక ఏడ్చేసింది.

తర్వాత అందరిని పొగిడే పనిలో బిజీ అయిపోయారు శివ. తొలుత భోలేని నేను మీకు పెద్ద ఫ్యాన్.. అంటూ కాళ్ల మీద పడ్డాడు. శివాజీ గారు మీరు చాలా బాగా ఆడుతున్నారు అంటూ చెప్పేశాడు. ఇలా ఒక్కొక్కరిని పొడిగేశాడు శివ. తర్వాత ప్రియాంకకు సలహాలు ఇచ్చారు శివ. మీ అమ్మ నిన్ను బాగా మిస్ అవుతుంది.. నేను రోజూ మాట్లాడుతున్నా.. మా అమ్మ కూడా నిన్ను బాగా మిస్ అవుతుంది అని చెప్పాడు.

Also Read:రెండో గెలుపు నమోదు చేసిన ఇంగ్లాండ్..

నీకు ఏదైనా నచ్చకపోతే అక్కడ మాట్లాడు.. కానీ ఆ గొడవను సాగదీయకు.. అలా సాగదీసి గొడవ పడటం నాకు నచ్చట్లేదు అని చెప్పాడు. తర్వాత ఇండైరెక్ట్‌గా అమర్-శోభాల గురించి కూడా ప్రియాంకకి వార్నింగ్ ఇచ్చాడు . బయట ఫ్రెండ్‌షిప్ బయటే ఇక్కడ వద్దు.. ఎవరూ అవసరం లేదు నీకు అని చెప్పాడు. ఇక బయటికి వెళ్లేందుకు టైమ్ దగ్గర పడటంతో మరోసారి తను చెప్పాల్సింది ఇండైరెక్ట్‌గా చెప్పాడు.

- Advertisement -