Bigg Boss 7 Telugu:ఒక్కొక్కరికి క్లాస్ పీకిన నాగ్

60
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు 55 రోజులు పూర్తి చేసుకుంది. ఇక తాజా వారం వీకెండ్ వాడంతో నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. తొలుత అమర్, శోభా, ప్రియాంక కలిసి సింక్ ఆర్ ఫ్లోట్ గేమ్‌లో చేసిన ఫేక్‌ను వీడియో వేసి చూపించారు. గేమ్ అలా ఆడటం కరక్టా అని అడిగారు. ఈ ముగ్గురికి పంచ్ ఇచ్చారు నాగార్జున. తర్వాత యావర్‌పై సీరియస్ అయ్యారు. ఆ బిహేవియర్ ఏంటి.. ఈ బిహేవియర్‌కి ఎవరైనా పిచ్చోడనే అంటారు అన్నారు. తర్వాత యావర్‌కి శోభాతో సారీ చెప్పింది ఇద్దరిని హగ్ చేయించుకోమని చెప్పారు.

తర్వాత శోభాను మరో ప్రశ్న వేశారు నాగార్జున. నామినేషన్స్‌లో తనను హిట్లర్ అన్నందుకు యావర్‌ని నామినేట్ చేసింది శోభా. దీంతో ఆ వీడియో ప్లే చేసి యావర్ నిన్ను నిజంగా హిట్లర్ అన్నాడా అని నాగ్ అడిగారు. అంటే హిట్లర్ అని వినిపించింది సార్ అంటూ చాలా అమాయకంగా నటించేసింది. నీకు డౌట్ ఉన్నప్పుడు నువ్వు అంత ఖరాఖండీగా ఎలా చెప్పావ్.. మరి అంత కచ్చితంగా ఎలా చెప్పావ్. అంటూ నాగ్ ప్రశ్నించారు. నీ పాయింట్ కూడా తప్పు .. అవతల వాళ్లు ఏం చెబుతున్నారో విను అని శోభా గాలి మొత్తం తీసేశారు.

బిగ్‌బాస్ ప్రాపర్టీ డ్యామేజ్ అయినా నువ్వు ఎందుకు సైలెంట్‌గా ఉన్నావ్.. అంటూ అర్జున్‌ను అడిగారు. ఇక అమర్‌తో మాట్లాడుతూ ప్రశాంత్ అంటే నీకు చిన్నచూపు అంటాను.. ఏమంటావ్ అని నాగ్ అడిగారు. లేదు సార్ అని అమర్ అన్నాడు. మరి ప్రశాంత్‌ని అన్న ఆ మాట.. సందీప్, అర్జున్ మీద ఎప్పుడైనా వాడావా అని నాగ్ అడిగారు. దీంతో సారీ సార్ ఇంకెప్పుడు అలా మాట్లాడను అని చెప్పగా ప్రశాంత్ క్షమించడంతో అక్కడికి వదిలేశాడు.

Also Read:Kavitha:తెలంగాణ ప్రజలే మా జట్టు

తర్వాత రతిక వంతు వచ్చేసింది. హౌస్ డెసిషన్ రైట్.. అందుకే నీకు తక్కువ ఓట్లు వేశారు. హౌస్‌లోకి కబుర్లు చెప్పడానికి వెళ్లావా.. అంత ఛాన్స్ పెట్టుకొని ఏం చేశావ్…గతం గురించి మాట్లాడితే గతంలోనే ఉండిపోతావ్.. మనుషుల మీద కాన్సట్రేషన్ చేయకు.. గేమ్ మీద చెయ్ అంటూ మండిపడ్డారు. ఈ వారం ఆట తీరులో మంచి ప్రశంసలు అందుకున్న అర్జున్, ప్రశాంత్, ప్రియాంక, అశ్వినిల జెండాలను నాగ్ పాతారు. మిగిలిన వారందరివీ విరిచేశారు. ఈ వారం నామినేషన్స్‌లో ఎనిమిది మంది ఉండగా గౌతమ్, ప్రియాంక ఇద్దరూ సేఫ్ అయ్యారు.

- Advertisement -