బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా ఐదోవారం పూర్తికావడానికి వచ్చింది. ఇక ఈ వారం హౌస్ నుండి ఒకరు ఎలిమినేట్ కానుండగా వీకెండ్ కావడంతో ఎంట్రీ ఇచ్చారు నాగ్. వారం రోజుల ఎపిసోడ్‌ని రివైండ్ చేస్తూ అమర్‌దీప్‌కు గట్టిగా క్లాస్ పీకాడు. తొలుత హౌస్‌లో తొలి కెప్టెన్ అయినందుకు ప్రశాంత్‌ని ప్రశంసించారు. ఇష్టం లేకుండా చప్పట్లు కొడుతున్న అమర్‌కి కౌంటర్ ఇచ్చారు నాగ్.
తర్వాత ఒక్కో బడ్డీ జంటను లేపి వాళ్ల తప్పుల గురించి మాట్లాడారు. ఇక అమర్-సందీప్ జంటని లేపి…ఈ వారం మీకు జరిగిన అన్యాయాలు చెప్పండి అని అడగ్గా ఏమీ లేవు సార్ అంటూ అని చెప్పేశారు. అవునులే మీకేముంటాయి.. మీ వల్ల మిగిలిన వాళ్లకి అన్యాయం జరిగి ఉంటుంది అంటూ కౌంటర్ వేశారు. తర్వాత దొంగ గురించి టాపిక్ వస్తే నాగార్జున మళ్లీ అమర్‌కి చురకలు అంటించారు. ప్రశాంత్ దొంగలా ఉన్నాడని నువ్వు ఎలా అంటావ్ అని ప్రశ్నించారు. అయ్యో నేను అలా అనలేదు సార్.. ఎప్పుడు అన్నానంటూ చెప్పగా వీడియో వేసి చూపించారు నాగార్జున. లుక్ వల్ల కాదు.. చేసే పని వల్లే దొంగ, దొర అనేది తెలుస్తుంది అని అమర్ నిజస్వరూపాన్ని బయటపెట్టేశారు.
తర్వాత ఫ్రూట్ నింజా టాస్క్‌లో కూడా పక్కన ఉన్న బత్తాకాయి తీసి జ్యూస్ తీశావ్ కదా అంటూ సందీప్ వీడియో వేసి మరీ చూపించారు నాగార్జున. అవును సార్ అది తప్పే కానీ అది కూడా గేమ్‌లో భాగమే అంటూ సమర్థించుకోబోయాడు సందీప్. నువ్వు ఇప్పటికే హౌస్ మెట్ అయిపోయావ్ కదా మరి నీ లెటర్ త్యాగం చేసి అమర్‌ని కంటెండర్‌గా ఎందుకు పంపలేదు.. పంపి ఉంటే కెప్టెన్ అయ్యుండేవాడేమో కదా అని నాగ్ ప్రశ్న వేశారు. గెలవడం ఎంత ముఖ్యమో ఆ గెలుపు కోసం మనం ఎలా ప్రయత్నిస్తున్నాము అన్నది కూడా అంతే ముఖ్యం సందీప్.. ఇది గుర్తుపెట్టుకో అంటూ క్లాస్ పీకారు.
Also Read:అజయ్ భూపతి.. ‘మంగళవారం’ సెకండ్ సాంగ్