Bigg Boss 7 Telugu:అమర్ వెధవ..పదేపదే నోరుజారిన శివాజీ

34
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు విజయవంతంగా 103 రోజులు పూర్తి చేసుకుంది. ఇక ఈ సీజన్ ఎండింగ్‌కి రాగా అమర్‌ని పదే పదే వెదవ అంటూ మాట్లాడాడు శివాజీ. అమర్‌దీప్‌ని ఒక్కొక్కరి జ్యోతిష్యం చెప్పాలని కోరగా విక్రమార్కుడు సినిమాలో రవితేజను గుర్తు చేశాడు. ఫన్నీగా అందరికీ జ్యోతిష్యం చెప్పాడు. ప్రశాంత్‌ది చాలా పెద్దది అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్‌లు కొట్టాడు.అంత పెద్దదా? అంటూ పక్కన ఆడ పిల్ల ఉందనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా డబుల్ మీనింగ్ డైలాగ్‌లు కొట్టాడు శివాజీ.

అర్జున్ గురించి అమర్ అంటే.. వెధవల్ని ఎంకరేజ్ చేయరు కదండీ అంటూ అమర్‌ని వెధవ అనడం స్టార్ట్ చేసిన శివాజీ.. ఆ తరువాత నుంచి పదే పదే వెధవ వెధవ అంటూ మాట్లాడాడు. శివాజీ జాతకం చెప్పే టైం రావడంతో.. అన్నా మీ జాతకం చెప్తాను దయచేసి కోప్పడకండి అన్నాడు. పల్లవి ప్రశాంత్, యావర్‌లకే అన్నీ ఇస్తారు.. మీ గొంతు చూసి మీ దగ్గరకు వచ్చి మాట్లాడరు. మీకు కాఫీ అంటే ఎక్కువ ఇష్టం… మీకు పంచే గుణం ఎక్కువ అని చెప్పాడు.

తర్వాత శివాజీ..ఇప్పుడు నేను ఓ వెధవ జాతకం చెప్పాలని అనుకుంటున్నాను అని అన్నాడో లేదో అమర్ జాతకం చెప్పాల్సిందిగా శివాజీకి లెటర్ పంపించాడు బిగ్ బాస్. దీంతో శివాజీ అస్సలు ఆగలేదు. రేయ్ నేను నీ చేతులు చూడాల్సిన అవసరం లేదు నీ ఫేస్ చూస్తే చాలు.. సహజంగా నిన్ను చూడగానే ఎవడీ వెధవ అని మనసులో వస్తుంది…వెధవ అని అంటే నీకు ఓకే కదా.. ఈ వెధవ జాతకం మొత్తం బయటపెడతా.. మనిషి మంచోడే గుణమే గుడిసేటిది. అడ్డదారులు ఎక్కువ.. ఆ అడ్డదారుల వల్ల కప్పుకి దగ్గర కావాల్సినోడివి.. కప్పుకి అరకిలో మీటర్ దూరంలో ఉన్నావ్ అని చెప్పాడు. శివాజీ ఎన్నిసార్లు వెధవ వెధవ అని అన్న అమర్‌ లైట్‌గానే తీసుకున్నాడు.

Also Read:తిరుమల టికెట్ బుకింగ్ అప్‌డేట్

- Advertisement -