Bigg Boss 7 Telugu:7వ వారం నామినేషన్స్‌లో ఉంది వీరే

31
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా 7 వారంలోకి ఎంటరైంది. ఇక సోమవారం నామినేషన్స్ ప్రక్రియ హాట్ హాట్‌గా సాగింది. ఈ వారం అంతా కలిసి భోలేని టార్గెట్ చేశారు. మెజారిటీ కంటెస్టెంట్స్ భోలేని నామినేట్ చేయగా ఈ ప్రక్రియలో అమర్ దీప్, శోభాశెట్టి, అర్జున్, ప్రియాంక, పూజా అయితే భోలేతో గట్టిగా గొడవపడ్డారు.

ఇక ఈ వారం నామినేషన్స్‌లో భోలే, అశ్విని శ్రీ, శోభాశెట్టి, ప్రియాంక, తేజా, ప్రశాంత్/ శివాజీ, సందీప్, గౌతమ్ ఉన్నారు. ప్రశాంత్ / శివాజీల్లో ఒకరే నామినేషన్స్‌లో ఉండనుండగా అసలు ట్విస్ట్ ఇవాళ ఎపిసోడ్‌లో తెలియనుంది.

అయితే ఈ వారం భోలే హౌస్ నుండి ఎలిమినేట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. బిగ్ బాస్ పేరుకి మాత్రమే రియాలిటీ షో. అక్కడ రియాలిటీ దూరంగా ఎంత ఫేక్‌గా నటిస్తే అంతగా ముందుకు వెళ్లొచ్చు. ఇప్పుడు హౌస్‌లో ఉన్నది చేస్తున్నది అదే. నిజానికి మొదట్లో కూడా పల్లవి ప్రశాంత్ కూడా ఇలాగే ఉన్నాడు. ఆ తరువాత తన ఆటని గాడిలో పెట్టుకున్నాడు. మరి భోలే విషయంలో ఏం జరుగుతోంది వేచిచూడాలి.

Also Read:Curd:పెరుగుతో అందం

- Advertisement -