Curd:పెరుగుతో అందం

377
curd
- Advertisement -

బలవర్ధకమైన ఆహారాల్లో పెరుగు ఒకటి. పెరుగు లేకుండా భోజ‌నం సంపూర్ణమైనట్లు అనిపించదు. రుచికి అద్భుతంగా ఉండే పెరుగు రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యవంతంగా ఉండటానికి దోహదం చేస్తుంది. సులభంగా జీర్ణమయ్యే పెరుగు అన్ని వయసుల వారూ తీసుకోదగిన ఆహారం. ఆరోగ్యానికి పెరుగు ఎంతగా ఉపయోగపడుతుందో చర్మ సౌందర్య పరిరక్షణలోనూ పెరుగు అంతే మేలుచేస్తుంది.

()రోజూ గడ్డపెరుగును ముఖానికి రాసుకొని ఆరిన తర్వాత చన్నీటితో ముఖం కడుక్కొంటే తగినంత తేమ అందుతుంది. చలికాలంలో పోడూరి చర్మం గలవారికి ఇదెంతో మేలుచేస్తుంది.

()ఎండ, వేడి ధాటికి కమిలిపోయిన చర్మానికి పెరుగు రాస్తే చర్మం పూర్వస్థితిని పొందుతుంది.

()మజ్జిగలో పలుచటి బట్టను ముంచి ఆ బట్టను ముఖం మీద వేసుకోవాలి. ఇలా పది నిమిషాలకి నాలుగైదు సార్లు చేయాలి. అనంతరం శుభ్రమైన పొడిబట్టతో తుడుచుకోవాలి. తరువాత గోరువెచ్చటి నీళ్లలో బట్టను ముంచి తుడుచుకోవాలి. ఇలా రాత్రి పడుకునే ముందు చేస్తే చర్మం బాగుంటుంది.

()మెటిమలు ఎక్కువగా ఉన్నవారుర పెరుగులో శనగపిండిని కలపాలి. ఈ ముద్దను ముఖానికి రాసుకుని ఆరిన తరువాత నీళ్లతో కడుక్కోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల మొటిమలు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి.

Also Read:  KCR:కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో పడేయండి

()ముల్లంగి రసంలో మజ్జిగ కలిపి పట్టించి గంటసేపటి అనంతరం కడుక్కోవాలి. బాదం నూనె, ఒక స్పూన్ మజ్జిగ కలిపి ముఖానికి..మెడకు..శరీరానికి స్నానం చేసే ముందు పట్టించాలి. అరగంట అనంతరం బట్టతో తుడుచుకుని స్నానం చేయాలి. తలకు పెరుగును బాగా పట్టించి మర్దన చేసి తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గే అవకాశం ఉంది.

()పెరుగులో ల్యాక్టిక్ యాసిడ్‌లు అత్యధిక స్థాయిలో లభిస్తాయి. విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందుకే ఈ ఎండల్లో ఈ ప్యాక్‌లు తప్పనిసరి.

()ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ ఆలుగడ్డ రసం, రెండు స్పూన్ల గ్లిజరిన్ తీసుకొని ఒక గిన్నెలో బాగా మిక్స్ చేయాలి. పది నిమిషాల తర్వాత ముఖం కడిగేసుకుంటే సరి.

()ఒక టేబుల్‌స్పూన్ ఓట్‌మీల్, రెండు టేబుల్‌స్పూన్ల పెరుగు, రెండు టీస్పూన్ల నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి రాయాలి. పావు గంట తర్వాత కడిగేయాలి. ఇది ఫేస్ టోనర్‌గా పనిచేస్తుంది.

()పెరుగులో కీరదోసకాయను తురిమి వేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు రాయాలి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత ముఖం కడుక్కోవాలి. దీంతో చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది.

 

- Advertisement -