బిగ్ బాస్ తెలుగు 6 విజయవంతంగా సాగుతోంది. ఫస్ట్ వీక్ పూర్తయి సెకండ్ వీక్‌లో అడుగుపెట్టగా రెండో వారం నామినేషన్స్ హాట్ హాట్‌గా సాగాయి. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులకు సిసింద్రీ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.
ప్రతి సభ్యుడికి ఓ బేబీ బొమ్మని ఇచ్చారు. బిగ్‌బాస్ చెప్పేదాకా ఆ బొమ్మని సొంత బేబీలా చూసుకోవాలని చెప్పారు బిగ్ బాస్. టాస్క్‌లో భాగంగా ఆ బొమ్మకి పాలు పట్టాలి, డైపర్లు మార్చాలి, తినిపించాలి..దీంతో ఇంట్లో సభ్యులంతా టాస్క్‌లో నిమగ్నం అయ్యారు. ఆ బొమ్మలు ఏడ్చేలా, నవ్వేలా సెట్ చేశాడు బిగ్‌బాస్.
ఇక ఈ టాస్క్ లో గీతూని బాగా ఆడుకున్నారు బిగ్‌బాస్. గీతూ అవస్థ చూడలేక హౌస్ లో అందరూ నవ్వేశారు. ఈ టాస్క్ లో బజర్ మోగినప్పుడు గార్డెన్ ఏరియాలో ఉన్న ఐదు బేబీ చైర్‌లో బేబీని పెట్టిన వారు నెక్ట్స్ కెప్టెన్సీ టాస్క్ కి ఎంపికవుతారు అని చెప్పారు. రేవంత్ బేబీని వేరే వాళ్ళు తీసుకోవడంతో కెప్టెన్సీ పోటీ నుండి తప్పుకున్నాడు. తర్వాత మరో గేమ్ గోనె సంచులు తొడుక్కుని బాక్సెస్ ఫిల్ చేసే టాస్క్ ఇచ్చారు.