ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత..

33
harish rao

ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత ఉంటుందన్నారు మంత్రి హరీష్ రావు. ఓ టీవీ ఛానల్ నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీష్ రావు..షి ఎంత సంపాదించినా.. ఎన్ని ఆస్తులు ఉన్నా… ఎన్ని పదవులు ఉన్నా చివరకు.. కోరుకునేది ప్రశాంతతే అని.. మనిషికి ఆ ప్రశాంతత చేకూర్చేది ఆధ్యాత్మిక చింతన మాత్రమే అన్నారు.

ప్రతి ఒక్కరూ తమకు తాము ఏదైనా పని చేస్తే వ్యక్తిగత దినచర్యగా మారుతుందని… అదే అందరూ కలిసి ఏదైనా లక్ష్యం కోసం పనిచేస్తే అది ఉద్యమం అవుతుందని హరీష్‌రావు వ్యాఖ్యానించారు. అలాగే ఎవరి ఇంట్లో వారు పూజ చేసి దీపం వెలిగిస్తే అది భక్తి అవుతుందని.. అదే అందరూ ఒకచోట చేరి సామూహికంగా కోటి దీపోత్సవంలో దీపాలను వెలిగిస్తే భక్తి ఉద్యమంగా మారుతుందన్నారు.

అలాంటి కోటి దీపోత్సవంలో పాల్గొన్న భక్తులకు భగవంతుడు ఆయురారోగ్యాలు అందించాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా హరీష్‌ రావుకు వేద పండితులు ప్రత్యేకంగా ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు.