బిగ్ బాస్ 5 కంటెస్టెంట్లు వీరే..!

391
Bigg Boss 5 Telugu
- Advertisement -

తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ షో విజయవంతంగా 4 సీజన్‌లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరి కొన్ని గంటల్లో బీబీ సీజన్‌ 5 సందడి మొదలు కానుంది.. బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ఈ సీజన్ ఈరోజు నుండి ప్రారంభం కాబోతోంది.

ఈ సీజన్ కు కూడా కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. కరోనా నిబంధనల ప్రకారం కంటెస్టెంట్లంతా గత కొన్ని రోజులుగా ప్రముఖ హోటళ్లలో క్వారంటైన్‌లో ఉన్నారు. వీరంతా ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో హౌస్ లోకి అడుగుపెడుతున్నారు. నేడు సాయంత్రం బిగ్ బాస్ 5 తొలి ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది.

బిగ్ బాస్ 5 కంటెస్టెంట్లు వీరే: యాంకర్ రవి, యానీ మాస్టర్, యూట్యూబర్ సరయు, రేడియో జాకీ కాజల్, సీరియల్ హీరో మానస్, సీరియల్ నటి ప్రియ, నటరాజ్ మాస్టర్, నటి శ్వేత వర్మ, లహరి, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్.

- Advertisement -