సర్‌ప్రైజ్…నోయల్ రీఎంట్రీ!

163
noel
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 58 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు ఇంటి సభ్యుల బిగ్ బాస్ జర్నీ సగం పూర్తి కాగా ఇప్పటినుండి మరింత రసవత్తరంగా ఆట ఉండనుందని బిగ్ బాస్ వెల్లడించారు.

ఇక 8వ వారంలో అనారోగ్య కారణాలతో ఇంటి నుండి బయటకు వెళ్లారు నోయల్. వెళ్తూ వెళ్తూ అవినాష్, అమ్మా రాజశేఖర్ మాస్టర్‌లని టార్గెట్ చేస్తూ వెళ్లారు నోయల్. ఇక నోయల్ ఎలిమినేషన్‌ని అఫీషియల్‌గా ప్రకటించారు నాగార్జున.

తాజాగా ఓ సర్‌ ప్రైజ్ వీడియోని రిలీజ్ చేశారు నోయల్. గేమ్‌ ఇప్పటికీ ఆన్‌లోనే ఉంది. ఏదైనా జరగొచ్చు.. నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. నా హెల్త్ కోసం ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు. ఎన్నో మెసేజ్‌లు వస్తున్నాయి. వాటిని చూస్తే చాలా ఎమోషనల్‌గా ఉంది. కానీ.. బిగ్ బాస్ గేమ్‌లో ఏదైనా జరగొచ్చు.. ది గేమ్ ఈజ్ స్టిల్ ఆన్. పని అయిపోయింది అనుకున్నవాడు మళ్లీ తిరిగి వస్తే ఆ కిక్ వేరేలా ఉంటుంది కదా? త్వరలో ఫుల్‌ డీటైల్స్ అందిస్తా మళ్లీ కలుద్దాం అంటూ సర్‌ప్రైజ్ ఇచ్చాడు.

- Advertisement -