ఇది గలీజ్ నామినేషన్‌..సోహైల్ వర్సెస్ అరియానా

96
ariyana

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 58 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 58వ ఎపిసోడ్‌ సోమవారం నామినేషన్ ఎపిసోడ్ కావడంతో ఆధ్యంతం ఆసక్తిగా సాగింది. ముఖ్యంగా అరియానా – సోహైల్‌ల మధ్య మాటలయుద్ధంతో హౌస్‌లో హీట్ పెరిగిపోయింది.

మార్నింగ్ వేకప్ సాంగ్ వేసిన సొహైల్, మెహబూబ్‌లు ఇద్దరూ పడుకోవడంతో బిగ్ బాస్ ఇంట్లో కుక్కలు మొరిగాయి. దీంతో పనిష్మెంట్‌గా మెహబూబ్ రెండు బకెట్లతో స్నానం చేశాడు. తర్వాత సొహైల్ పడుకోవడం మళ్లీ కుక్కలు అరవడంతో అరియానా వచ్చిన సొహైల్ స్నానం చేయాలని తెలిపింది.

నేను ఇప్పుడే స్నానం చేశా.. సాయంత్రం చేస్తా అని అరియానాతో చెప్పగా ఆమె కుదరదని చెప్పడంతో ఆవేశంతో స్విమ్మింగ్‌ ఫూల్‌లోకి దూకాడు. ఆగ్రహంతో ఊగిపోతూ స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు రాను అంటూ రచ్చరచ్చ చేశాడు. కాసేపటి తర్వాత బయటకు వచ్చినా తడి బట్టలతోనే వచ్చి ఆగమాగం చేశాడు. నేను మళ్లీ పడుకుంటా.. మళ్లీ స్విమ్మింగ్ పూల్‌లో దూకుతా.. ఈసారి నాకు పనిష్మెంట్ ఇస్తే నేను చేయ్యను… ఏం చేస్తారో చేసుకోండి అని తేల్చిచెప్పేశాడు. ఈలోపు డ్రెస్ మార్చుకుంటూ మైక్ తీసి పక్కన పెట్టడంతో బిగ్ బాస్ నుంచి మైక్ ధరించాలని అనౌన్స్ మెంట్ వచ్చింది.

ఇక మళ్లీ అరియానా వచ్చి సొహైల్‌కి మళ్లీ పనిష్మెంట్ ఇవ్వడంతో తాను చేయనంటూ పిచ్చిపిచ్చిగా చేశాడు. గొడవ పెద్దది చేస్తూ సొహైల్ షూ లేస్ తీసుకున్న అరియానా దాన్ని తిరిగిఇవ్వకపోవడంతో దానిని బేస్ చేసుకుని నా లేస్ ఇవ్వలేదు కాబట్టి.. పనిష్మెంట్ ఇస్తా అంటూ గొడవకు దిగాడు.

ఇక నామినేషన్ టాస్క్‌లో భాగంగా తొలుత అరియానా పేరు చెప్పారు బిగ్ బాస్. అరియానా మొదటి గుడ్డుని హారిక తలపై పగలగొడుతూ.. రాక్షసుల టాస్క్‌లో ఆమె ప్రవర్తన నచ్చలేదని చెప్పింది.ఇక రెండో గుడ్డుని సొహైల్ తలపై కొట్టింది. నేను స్ట్రిక్ట్‌గా కెప్టెన్సీ చేయాలని అనుకున్నా.. కానీ నువ్ మార్నింగ్ నేను పనిష్మెంట్ ఇచ్చినా నువ్ చేయను అని అన్నావ్ అందుకే నిన్ను నామినేట్ చేశా.. అని చెప్పింది. దీంతో సోహైల్‌ మరోసారి రెచ్చిపోయాడు.

ఇప్పటి వరకూ 8 మంది కెప్టెన్లు అయ్యారు.. నేనూ అయ్యా.. నీలా ఎవరూ చేయలేదు.. నీ యాటిట్యూడ్ చూపించకు.. నువ్ పెద్ద పుడింగిలా ఫీల్ అయిపోకు. గలీజ్‌ రీజన్‌ చెప్పి నామినేట్‌ చేయకు. కెప్టెన్‌ అయినంత మాత్రనా ఏది చెబితే అది చేయ్యం. నీ ప్రతాపం అంతా నామీద,మెహబూబ్‌ మీదే చూపిస్తావు. ఇది గలీజ్‌ నామినేషన్ అంటూ ఫైర్ అయ్యాడు.

ఇక తర్వాత సొహైల్ వంతు రాగా ఈ వారం కెప్టెన్‌గా అరియానా ఉండటంతో నామినేట్ చేయలేకపోతున్నానని వచ్చేవారం ఖచ్చితంగా నామినేట్ చేస్తానని శపథం చేశాడు. ఆ తర్వాత కూడా అరియానాను టీజ్ చేస్తూ పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడు సొహైల్. అయితే సొహైల్ ఎంత గట్టిగా అరిచినా అరియానా మాత్రం సైలెంట్‌గా ఉండిపోయింది.