అవినాష్ సీక్రెట్ టాస్క్‌…సొహైల్-మెహబూబ్‌కు తిప్పలు!

213
avinash
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ 4 తెలుగు విజయవంతంగా 32 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. సీక్రెట్ టాస్క్‌లో భాగంగా అవినాష్‌ తన ప్లాన్‌ను పర్‌ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేస్తుండగా సొహైల్- మెహబూబ్ తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.

సోహైల్ మ‌ట‌న్ బిర్యానీ ఆర్డ‌ర్ ఇవ్వ‌గా దానిని హోటల్ సిబ్బంది ఎంతో రుచిగా వండి వ‌డ్డించారు. అయితే అందులో వెంట్రుక,హెయిర్ పిన్ వేశాడు అవినాష్. అయితే సొహైల్ తింటున్న క్రమంలో అవి రావడంతో రచ్చ రచ్చ చేసిన సోహైల్ క్ష‌మాప‌ణ‌లు చెప్పినా కాంప్ర‌మైజ్ కాలేదు.ఇక మెహబూబ్‌ తింటున్న మటన్‌లో ఉప్పు ఎక్కువ వేశాడు అవినాష్. దీంతో తనకు మటన్ అంటే ఎంతో ఇష్టమని కానీ ఇంత ఉప్పు ఎక్కువగా వేసి తినకుండా చేశారని తెగ బాధపడ్డారు మెహబూబ్.

తర్వాత సర్వీస్ సరిగా లేదని తమకు వేరే వంటలు కావాలని మెహబూబ్‌ చెప్పగా అవినాష్‌ చెప్పిన సమాధానాలకు విసిగిపోయిన మెహ‌బూబ్ నా జోలికి ఎవ‌డైన వ‌స్తే పుచ్చెలు పగిలిపోతాయి అని ఫైర్ అయ్యాడు. దీంతో తొలుత అఖిల్ తర్వాత అవినాష్‌ …మెహబూబ్‌తో గొడవకు దిగారు. లిమిట్స్ దాటి మాట్లాడుతున్నావ్ అని అఖిల్ సీరియస్‌ కాగా నీ కండ‌లని చూసి ఎవ‌డు భ‌య‌ప‌డ‌డు. సెల‌బ్రిటీ స్టేట‌స్‌ని ప‌క్క‌న పెడితే మేం కూడా రౌడీలమే. నీ రౌడీయిజం నీ ఊర్లో చూపించుకో. ఇక్క‌డ కాదు. ఎక్కువ అర‌వ‌కు మ‌ళ్లీ ఆక‌లేస్త‌ది అంటూ కౌంట‌ర్ ఇచ్చాడు.

- Advertisement -