రేపే నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌!

157
kavitha

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్‌ శుక్రవారం జరగనుంది. టీఆర్‌ఎస్‌ నుంచి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్‌ నుంచి వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి, బీజేపీ నుంచి పోతన్‌కార్‌ లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు. 90 శాతం ఓట్లు టీఆర్ఎస్‌కే ఉండటంతో ఆ పార్టీ గెలుపు నల్లేరుపై నడకే కానుంది.

మొదట్లో 6 పోలింగ్‌ కేంద్రాలను మాత్రమే నిర్ణయించగా కరోనా నేపథ్యంలో వీటిని ఏకంగా 50కి పెంచారు. ఇందులో నిజామాబాద్‌ జిల్లాలో 28, కామారెడ్డి జిల్లాలో 22 ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 824 మంది ఓటర్లు ఉంటే వీరిలో 24 మంది ఓటర్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కరోనా సోకినవారు పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేయాలనుకుంటే తప్పనిసరిగా పీపీఈ కిట్లు ధరించాల్సి ఉండటంతో పాటు సాయంత్రం 4నుంచి 5గంటల మధ్య ఓటు వేసేందుకు అనుమతిచ్చారు.

ప్రతీ పోలింగ్‌ కేంద్రంలో 4 పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచుతున్నాం. 14 కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించాం. ఓటర్లు మాస్కులు, గ్లౌజులు వేసుకుని రావాల్సి ఉంటుంది.