నా బిడ్డను చంపేసుకున్నా: లాస్య

180
lasya
- Advertisement -

బిగ్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 61 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 61వ ఎపిసోడ్‌లో భాగంగా సమాజం కోసం కానీ.. వేరే వాళ్ల జీవితంలో వెలుగులు నింపిన సంఘటనల్ని కానీ ఇంటి సభ్యులందరితోనూ పంచుకోవాలని బిగ్ బాస్ సూచించారు.

ఈ క్రమంలో తన లైఫ్‌లో జరిగిన సంఘటనని చెబుతూ అందరిని కంటతడి పెట్టించింది లాస్య. 2010లో నాకు పెళ్లి అయింది. 2012లో క‌లిసి ఉన్నాం. 2014 జ‌న‌వ‌రిలో నాన్న ద‌గ్గ‌రి నుంచి ఫోన్ వ‌చ్చింది. ముందు సెటిల్ అవండి. త‌ర్వాత వాళ్లే స్వ‌యంగా పెళ్లి చేస్తాం అన్నారు. అది చూసి హ్యాపీగా ఫీల‌య్యాను. కానీ అదే వారం నేను ఆరోగ్యం బాగోలేక‌ ఆస్ప‌త్రికి వెళ్తే గ‌ర్భ‌వ‌తిని అని చెప్పారు.

ఫ్యామిలీకి చెప్పుకోలేక అబార్ష‌న్ చేసుకున్నాను. 2017లో మ‌ళ్లీ పెద్ద‌ల స‌మ‌క్షంలో పెళ్లి చేసుకున్నాం. ఐదు నెల‌ల‌కే నేను మ‌ళ్లీ గ‌ర్భ‌వ‌తిన‌య్యా. కానీ నిల‌వ‌లేదు. 2018లో నా పొట్ట‌లోకి జున్ను వ‌చ్చాడు. ఆ త‌ర్వాత నా లైఫ్ మారిపోయింది. అమ్మా నాన్నా.. అప్పుడు ఫస్ట్ బేబీని తీసేసుకున్న విషయం మీకు తెలియదు ఇప్పుడు చెప్తున్నా కాబట్టి.. తప్పు చేసి ఉంటే క్షమించండి అంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. ఇంటి సభ్యులంతా చెప్పిన వాటిలో ఇదే బెస్ట్ అనిపించడంతో లాస్యకు ఒప్పో దివాళి ఎడిషన్ ఫోన్‌ను అందించారు బిగ్ బాస్.

- Advertisement -