బిగ్ బాస్ 4….ఎపిసోడ్ 37 హైలైట్స్‌

254
episode 36
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 37 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఇక 37వ ఎపిసోడ్‌లో భాగంగా అభిజిత్-మోనాల్‌ మధ్య మాటల యుద్దం,మోనాల్ -అఖిల్ మధ్య రొమాన్స్‌,సొహైల్-కుమార్ సాయి మధ్య వాగ్వాదం,ఈ వారం ఇంటి సభ్యుల ఎలిమినేషన్ మధ్య ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది.

ఈ వారం సుజాత్ విసిరిన బిగ్ బాంబ్ టాస్క్‌లో భాగంగా బొళ్లు తోమే పనిలో బిజీగా ఉన్నాడు సొహైల్. మోనాల్- అభి మధ్య సీరియస్ డిస్కషన్ జరిగింది.నీకు నాకు మధ్య ఏం లేదా?? మోనాల్ అంటూ అభి నామినేషన్స్ టాపిక్ తీసుకొస్తూ ఇది అమ్మాయి ఇష్యూ అంటున్నావ్ దాన్ని ఉమెన్ ఇష్యూలా చూపించకు.. అఖిల్‌కి నీ మీద అంత ప్రేమ, కేర్ ఉంటే నేషనల్ టీవీలో వచ్చేస్తుందని అంటే నామినేషన్ ప్రక్రియలో నీ పేరు ఎందుకు ప్రస్తావించాడు. నాగ్

సార్ ముందు ఇద్దరిదీ తప్పు అంటావా అంటూ ఫైర్ అయ్యాడు. దీంతో మోనాల్ కంటతడి పెట్టేసింది. నేను నిన్ను తప్పుపట్టడం వేస్ట్ అంటూ అభిజిత్ చెప్పగా కనీసం గుడ్ మార్నింగ్ హాయ్‌‌లు అయినా చెప్పుకుందాం అభి అని అడిగింది మోనాల్. అభిజిత్ బర్త్ డే కావడంతో అరియానా స్పెషల్ కేక్ తయారుచేసి కట్ చేయించింది. ఇంటి సభ్యులంతా కేక్ కటింగ్‌కి వచ్చినా అఖిల్ మాత్రం దూరంగానే ఉన్నాడు. ఇక ఉదయాన్నే ఇంటి సభ్యులంతా అదిరే డ్యాన్స్‌లతో అలరించగా మోనాల్ ఒకవైపు బాధ నటిస్తూనే మరోవైపు అఖిల్‌ని గట్టిగా హగ్ చేసుకుంది.

ఇక తర్వాత సొహైల్ కప్పులు కడిగే విషయంపై రచ్చరచ్చ చేశాడు. ఎవరికి నచ్చినట్టు వాళ్లు కప్పులు తీసి పడేస్తున్నారని కడిగిని వాటిని నేను ఇవ్వను అనడంతో రచ్చ రేగింది. మొదట రాజశేఖర్ మాస్టర్ సొహైల్‌తో గొడవకు దిగగా అరియానా….సొహైల్‌పై ఫైర్ అయింది. నాగార్జున సార్‌కి మాట ఇచ్చాను కాబట్టి అరవకుండా ఉన్నా కానీ అరియానా నాపై పొగరు అంటూ అరించింది అని సొహైల్ బిగ్ బాస్ కెమెరా వద్దకు వెళ్లి చెప్పగా అరియానా కూడా తాను ఎందుకు అరుస్తున్నానో చెప్పుకొచ్చింది.

తర్వాత ఇదే అంశంపై డైనింగ్ టేబుల్ దగ్గర డిస్కషన్ జరుగగా సేమ్ సీన్ రిపీట్ అయింది. అరియానాతో పాటు కుమార్ సాయితో సొహైల్ వాదనకు దిగారు. దీంతో ప్లేట్ల క్లీనింగ్‌పై ఏం తేలకుండానే అలా ముగిసిపోయింది. ఈవారం నామినేషన్స్‌లో భాగంగా ఒక్కో ఇంటి సభ్యుడు ఇద్దరిద్దర్ని చొప్పున నామినేట్ చేయాలని.. నామినేట్ చేసిన ఇంటి సభ్యుడి మెడలో మిర్చీ దండ వేసి ఎందుకు నామినేట్ చేస్తున్నారో రీజన్ చెప్పాలని కోరారు బిగ్ బాస్.

తొలుత వచ్చిన అరియానా – మెహబూబ్, మోనాల్, దివి – నోయల్, మెహబూబ్,నోయల్ – దివి, అభిజిత్, హారిక – అరియానా, కుమార్ సాయి, అభిజిత్ – మెహబూబ్, అఖిల్, లాస్య – మెహబూబ్, దివి, మెహబూబ్ – దివి, అరియానా, సొహైల్ – అరియానా, కుమార్ సాయి, రాజ శేఖర్ మాస్టర్ – లాస్య, అభిజిత్,అవినాష్ – దివి, అభిజిత్, మోనాల్ – అరియానా, దివి, అఖిల్ – అభిజిత్, అరియానా,కుమార్ సాయి – హారిక, సొహైల్ పేర్లను నామినేట్ చేశారు.

టాస్క్ తర్వాత మెహబూబ్,అరియానా, అభిజిత్, మోనాల్, కుమార్ సాయి, దివి, అఖిల్, నోయల్, లాస్య, హారిక‌లు ఎలిమినేషన్‌కి నామినేట్ కాగా ఇంటి సభ్యుల్లో ఒకరిని సేవ్ చేసే ఛాన్స్ కెప్టెన్‌కి ఉంటుందని తెలపగా మెహబూబ్‌ని సేవ్ చేశాడు సొహైల్‌. దీంతో ఇద్దరూ ఎమోషన్ అయ్యారు.

- Advertisement -