కోల్ కతాను చిత్తు చేసిన ఆర్సీబీ…..

336
rcb
- Advertisement -

ఐపీఎల్‌ 2020లో భాగంగా షార్జా వేదికగా కోల్ కతాతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. బెంగళూరు విధించిన 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా 20 ఓవర్లలో 9 వికెట్లు కొల్పోయి 119 పరుగులు చేసింది. దీంతో ఆర్సీబీ 82 పరుగుల తేడాతో విజయం సాధించింది. కోల్ కతాపై గెలుపుతో టోర్నమెంట్‌లో 5వ విజయాన్ని నమోదుచేసి పాయింట్ల పట్టికలో మూడోస్ధానంలో నిలిచింది ఆర్సీబీ.

195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా ఏ దశలోనూ లక్ష్యచేదన దిశగా అడుగులు వేయలేదు. టాప్ ఆర్డర్ ఒక్కొక్కరుగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. బాంటన్ 8,నితీశ్ రానా 9,మోర్గాన్ 8,దినేశ్‌ కార్తీక్ 1,శుభ్ మన్ గిల్ 34 పరుగులు చేసి ఔటయ్యారు. దీంతో 64 పరుగులకే 5 వికెట్లు కొల్పోయి కష్టాల్లో పడింది.

అయితే క్రీజులో రసెల్ ఉండటంతో కోల్ కతా శిబిరంలో కాసింత ధైర్యం ఉన్న ఈ స్టార్ ఆటగాడు సైతం 16 పరుగులకే వెనుదిరగడంతో కోల్ కతా ఓటమి దాదాపుగా ఖరారైంది. తర్వాత కమ్మిన్స్ 1, త్రిపాఠి 13, నాగర్ కోటి 4 పరుగులు చేసి ఔటయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో మోరీస్ ,సుందర్ , చాహల్ ,సైనీ,ఉదాన,సిరాజ్ తలో వికెట్ తీశారు.

అంతకముందు టాస్ గెలిచిన ఆర్సీబీ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 194 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్‌(73నాటౌట్‌: 33 బంతుల్లో 5ఫోర్లు, 6సిక్సర్లు)వీరవిహారం చేయడంతో భారీ స్కోరు సాధించింది. డివిలియర్స్‌కు తోడుగా అరోన్‌ ఫించ్‌(47: 37బంతుల్లో 4ఫోర్లు, సిక్స్‌ ), దేవదత్‌ పడిక్కల్‌(32: 23 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్‌) , విరాట్‌ కోహ్లీ(33 నాటౌట్:‌ 28 బంతుల్లో ఫోర్‌) రాణించారు.

- Advertisement -