బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 11 హైలైట్స్

278
bigg boss 11
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ విజయవంతంగా 11 ఎపిసోడ్స్‌ పూర్తి చేసుకుంది. 11వ ఎపిసోడ్‌లో సేమ్ అఖిల్,అభిజిత్‌లు మొనాల్‌ను ఇంప్రెస్ చేసే పనిలో మరింత బిజీగా మారిపోగా హారిక డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌,ఆమెను మెహబూబ్ కిస్ చేయడం ఎపిసోడ్‌కి హైలైట్‌గా నిలిచింది.

అఖిల్-అభిజిత్-మొనాల్‌ గురించి గుసగుసలాడం మొదలుపెట్టారు లాస్య,సుజాత. నీతో ఎప్పుడు మాట్లాడాలని ప్రయత్నించిన వారు పక్కనే ఉంటున్నారని…మొనాల్‌తో చెప్పారు. వీరి విషయంలో ఏదో క్లారిటీ తీసుకోకపోతే తర్వాత ప్రమాదంలో పడతావని హెచ్చరించారు.

ఇక మార్నింగ్‌ ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో సాంగ్‌కి రెచ్చిపోయి డాన్స్‌లు చేశారు హౌస్ మేట్స్‌. దేత్తడి హారిక, అరియానాలు మరోసారి అందాల ప్రదర్శన చేశారు. అభి-మొనాల్‌లు ఇద్దరూ మాట్లాడుకోవడం చూసిన అఖిల్ ఇది రియాలిటీ షో..కాస్త జాగ్రత్తగా ఉండు అంటూ హితబోధ చేయగా నేను నాలాగే ఉండటానికి ట్రై చేస్తున్నా.. నాకు ఫీలింగ్స్ ఉంటాయి.. ఎప్పుడూ నవ్వుతూ ఉండలేను..ఎమోషన్స్‌ని దాచుకోలేనని అఖిల్ తెలపగా తాను ఆలోచించే ఇద్దరితో మాట్లాడుతున్నానని తెలిపింది మొనాల్.

ఇక లగ్జరీ బడ్డెట్‌లో భాగంగా దేత్తడి హారిక-మొహబూబ్, మొనాల్-సొహైల్‌లు,అమ్మ రాజశేఖర్‌ సింగిల్‌ సాంగ్‌కు డ్యాన్స్‌ చేయాలని కోరగా ఈ డాన్స్ షోకి లాస్య, నోయల్‌లు జడ్జీలుగా వ్యవహరిస్తారని యాంకర్‌గా అరియానా వ్యవహరిస్తుందని తెలిపారు.

మొనాల్‌‌-సొహైల్ డ్యుయెట్ అనేప్పటికి అఖిల్ తెగ ఫీల్ కాగా డాన్స్ ప్రాక్టీస్ పూర్తి కాగానే అఖిల్‌తో తిరిగి ముచ్చట్లు పెట్టింది మొనాల్. హౌస్‌లో మన గురించి ఏదో మాట్లాడుకుంటున్నారని నీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల మన మధ్య ఏదో నడుస్తుందని వాళ్లు అనుకుంటున్నారని తెలిపింది మొనాల్. ఇక అఖిల్‌తో చర్చ ముగియగానే మళ్లీ అభిజిత్‌తో ముచ్చట్లు షురూ చేసింది మొనాల్.

సినిమా చూపిస్త మామా సాంగ్‌కి రాజశేఖర్ మాస్టర్ మాస్ స్టెప్పులు వేయగా వానా వానా వెల్లువాయే సాంగ్‌కి మొనాల్‌తో కలసి అదిరిపోయే స్టెప్పులు వేశాడు సొహైల్. టాప్ లేచిపెద్ది సాంగ్‌కి మొహబూబ్, హారికలు నిజంగానే టాప్ లేపేశారు. సాంగ్ మధ్యలో హారికను మెహబూబ్ కిస్ చేయడం ఎపిసోడ్ మొత్తానికే హైలైట్. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో మరో సెలబ్రిటి వైల్డ్ కార్డు ఎంట్రీతో హౌస్‌లోకి అడుగుపెట్టనున్నాడు.

- Advertisement -