బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 95 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 95వ ఎపిసోడ్‌లో భాగంగా ప్రేక్షకులతో మాట్లాడే అవకాశాన్ని సోహైల్ కొట్టేయగా అరియానా-సోహైల్ మధ్య గొడవతో బిగ్ హౌస్ రచ్చరచ్చగా మారింది.
టాస్క్‌లో భాగంగా సొహైల్ ఓపికను పరీక్షించేందుకు ఇంటి సభ్యులు ప్రయత్నించారు. కానీ విఫలమయ్యారు. అయితే అరియానా మాత్రం సొహైల్‌ని తనకు ఇష్టం వచ్చినట్లు అనేసింది. తనకు ఇష్టమైన బొమ్మను వాటర్‌లో పడేశావ్…ఈ టాస్క్ తర్వాత నేను ఆడింది ఏంటి?? నువ్ ఆడింది ఏంటి?? ఎవరికి హార్ట్ ఉంది.. ఎవరికి హార్ట్ లేదని..ఎమోషన్స్‌తో ఆడుకున్నావ్ అంటూ మండిపడింది.
టాస్క్ పూర్తి కాగానే సొహైల్..అరియానా దుమ్ము దులిపాడు. నీదొక ఆటనా.. నీ అంత క్రూరంగా ఎవరైనా ఆడారా?? తొక్కలో ఆట ఆడావు.. అందర్నీ ఆడుకున్నావ్… అంటూ సొహైల్ మాట్లాడగా అరియానా సైతం వెనక్కి తగ్గలేదు. అఖిల్, అభిజిత్‌లు సొహైల్‌ని కంట్రోల్ చేసి వాష్ రూంలోకి బలవంతంగా తీసుకుని వెళ్లి గొడవ కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు.
అయితే అరియానా మాత్రం బిగ్ బాస్ కెమెరా ముందు బోరున విలపించింది. నేను తప్పు చేశానా బిగ్ బాస్.. మీరు ఆడమంటారు.. ఆ అబ్బాయి బిహేవియర్ తీసుకోలేకపోతున్నా అని.. నా ఆట నేను ఆడితే తప్పేంటి?? అని తెలిపింది. అభిజిత్ వచ్చి అరియానాను ఓదార్చుతూ.. కిందపడిపోయిన అరియానాను పైకి లేపి వాటర్ అందించాడు. ఇన్నిరోజులు బాగానే ఉన్నావ్ కదా.. ఇంకో రెండు వారాలు ఓపికపట్టు అని ధైర్యం చెప్పాడు.
సొహైల్.. అఖిల్ ముందు తన బాధ చెప్పుకున్నాడు. ఇక ఓపిక టాస్క్‌లో తక్కువ పాయింట్లు వచ్చిన సొహైల్ విజేతగా నిలవడంతో ప్రేక్షకుల్ని ఓట్లు అడిగే అవకాశం ఇచ్చారు. దీంతో తనకు ఓటు వేయాలని ప్రేక్షకుల్ని కోరుతూ ఎమోషనల్ అయ్యాడు సొహైల్. 18 సంవత్సరాలకే ఇండస్ట్రీకి వచ్చాను. కానీ పదేళ్లు అవుతున్నా గుర్తింపు రాలేదు. బిగ్‌బాస్ కప్పు కొట్టాలన్నదే నా లక్ష్యం. నా కోపం మీకు నచ్చకపోతే క్షమించండి. కానీ నేను మీ మనసుల్లో ఉండిపోవాలి” అని వీక్షకులకు సందేశమిచ్చాడు. తన కోపం గురించి చెప్తూ అదే తన మైనస్ అని, కానీ ఊరికే రాదని స్పష్టం చేశాడు. అరియానాకు చిన్న సమస్య అనిపించినా నోటికొచ్చినట్లు మాట్లాడుతుందని వాపోయాడు. కానీ ఆమెతో జరిగిన గొడవను ఇక్కడితో వదిలేస్తానని స్పష్టం చేశాడు. ఇక బయటకు వచ్చిన తరువాత కూడా సొహైల్.. అరియానాతో జరిగిన గొడవపై అఖిల్, మోనాల్ దగ్గర గుర్తు చేసుకుని ఏడ్చేశాడు.