తెలంగాణ కరోనా అప్‌డేట్…

138
covid 19
- Advertisement -

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 76 వేలకు చేరువయ్యాయి. గత 24గంటల్లో 643 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదుకాగా ఇద్దరు మృతిచెందారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,75,904కు చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 7497 యాక్టివ్ కేసులుండగా 2,66,925 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు కరోనాతో 1482 మంది మృత్యువాతపడ్డారు.

గత 24 గంటల్లో 53,396 టెస్టులు చేయగా.. ఇప్పటి వరకు 59,73,031 టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో మరణాల రేటు రాష్ట్రంలో 0.53శాతంగా ఉండగా.. దేశంలో 1.5శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. అలాగే రికవరీ రేటు 94.74శాతంగా ఉందని, జాతీయ సగటు 94.7శాతంగా ఉందని తెలిపింది.

- Advertisement -