బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 93 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 93వ ఎపిసోడ్‌లో భాగంగా అఖిల్ తప్ప మిగితా ఇంటి సభ్యులంతా ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు.
తొలుత హుషారైన సాంగ్‌కు డ్యాన్స్‌లు వేసిన ఇంటి సభ్యులు…అవినాష్‌కు గుడ్ మార్నింగ్ చెప్పారు. బిగ్ బాస్ కెమెరా దగ్గరకు వెళ్లిన అరియానా నా మొదటి జీతం రూ. 4 వేలు. నేను చాలా కష్టపడి ఇక్కడకు వచ్చాను. ఎంత సంపాదించినా నా వరకు సంతోషంగా ఉన్నా…ఇక్కడ మహారాణిలా బతుకుతున్నా.. ప్యాలెస్‌లో ఉండాలన్న కల ఎట్టకేలకు తీరిందని బిగ్ బాస్‌కు కృతజ్ఞతలు తెలిపింది.
అఖిల్ మినహా మిగితా సభ్యులంతా ఎలిమినేషన్‌కు నామినేట్అయ్యారని….మిమ్మల్ని మీరు నిరూపించుకోండంటూ ‘అధికారం’ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో రాజు, రాణి అయ్యేవాళ్లు బిగ్‌బాస్ రూల్స్‌ను మార్చుతూ సొంత నియమాలు పెట్టొచ్చని చెప్పాడు. ఈ టాస్కులో అఖిల్ మంత్రిగా వ్యవహరిస్తాడు.
మొదట బజర్ మోగగానే కిరీటాన్ని అందుకుని సోహైల్ రాజుగా అవతరించాడు. కిచెన్ దగ్గర పడేసి ఉన్న బోళ్లు తోమమని అరియానాను ఆదేశించాగా హారిక…అఖిల్‌తో పెళ్లి చేయాలని అభ్యర్థించింది. సోహైల్ గడువు ముగియడంతో తన కిరీటాన్ని అభిజిత్‌కు అప్పగించాడు. తను రాజుగా ఉన్నంతకాలం హారిక మాటకు ముందోసారి, చివరోసారి ఇకిలి పికిలి అనే పదాన్ని ఉపయోగించాలని అభిజిత్ హారికను ఆదేశించాడు. తర్వాత మోనాల్ పాట పాడగా దానికి సోహైల్, అరియానా రొమాంటిక్ డ్యాన్స్ చేశారు. అనంతరం మహారాణిగా మారిన హారిక.. తను చెప్పినవి చేయకపోతే బట్టలు స్విమ్మింగ్ పూల్‌లో పడేస్తానని హెచ్చరించింది.
ఇక అభిజిత్ కూడా హారికను పొగిడినట్లే పొగిడి ఇదంతా అబద్ధమని ఝలక్ ఇవ్వగా ఆగ్రహించిన రాణి అతడి బట్టలను స్విమ్మింగ్ పూల్‌లో పడేసింది.ఈ క్రమంలో అఖిల్‌పై మండిపడ్డాడు సొహైల్. నేను రాజుగా ఉన్నప్పుడు ఒక్క పని చేయలేదు కానీ ఆమె రాణిగా ఉన్నప్పుడు మాత్రం అన్ని పనులు చేస్తున్నాడని అఖిల్ మీద మండిపడ్డాడు. బట్టలు నీళ్లలో పడేయడం ఎంటర్‌టైన్‌మెంట్ కాదు…. నా బట్టలు పడేసి చూడమను, అందరివి నీళ్లల్లో వేసి ఉతుకుతా అని ఫ్రస్టేట్ అయ్యాడు.
తర్వాత బిగ్ బాస్ నామినేషన్స్‌లో ఉన్న వారు ఎవరికి వారు టాస్క్ ఆడి వందశాతం ఎఫర్ట్ పెట్టాలని చెప్పారు. ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా ఆడాలని.. మీ ప్రదర్శన, ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధానం ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని మిమ్మల్ని ప్రేక్షకుల చేతుల్లో పెడుతున్నాం అని బిగ్ బాస్ ఇంటి సభ్యులతో చెప్పారు. దీంతో ఒకరికొకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకుని రంగంలోకి దిగారు.