బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 79 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 79వ ఎపిసోడ్ సోమవారం నామినేషన్ ఎపిసోడ్ కావడంతో ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది. చివరగా మోనాల్,అఖిల్,అరియానా,అవినాష్‌లు ఇంటి నుండి బయటికి వెళ్లేందుకు నామినేట్ అయ్యారు.
తొలుత మార్నింగ్ వేకప్ సాంగ్‌కి అదిరిపోయే స్టెప్పులేశారు ఇంటిసభ్యులు. నీ వల్ల నేను ఎఫెక్ట్ అవుతున్నా.. నీతో రిలేషన్ వద్దు అంటూ మోనాల్ ముందు ఓపెన్ అయ్యాడు అఖిల్. నా మీద నాకు చాలా నమ్మకం ఉంది.మీ చెల్లి హిమాలీ రాగానే.. అఖిల్ గురించి నా గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారా? అని అడిగావ్… నీ వల్ల నాకు ఎక్కువ డిస్టబెన్స్‌లు వస్తున్నాయి. వాటిని మైండ్‌లో పెట్టేసుకోవడం వల్ల పిచ్చి పిచ్చిగా అవుతుందని తెలిపాడు అఖిల్. ఇక నాలుగు వారాలే ఉంది.. నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పు చేస్తా అంతేతప్ప.. నీతో ఓవర్‌గా కనెక్ట్ కాను.. నాకు ఎందుకో కొడుతుంది అంటూ మోనాల్ ముందు తేల్చి చెప్పేశాడు అఖిల్.
నాకు కూడా ఫ్యామిలీ ఉంది.. నేను ఒక అమ్మాయిగా అడగాల్సిన బాధ్యత ఉంది. నీ దృష్టిలో నేను బెస్ట్ ఫ్రెండ్..కాని నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నావ్ ఆ టైంలో. నాకు కొన్ని ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది మోనాల్.
ఇక కీలకమైన నామినేషన్ రెండు దశల్లో మొదలుపెట్టారు బిగ్ బాస్. తొలి దశలో గార్డెన్ ఏరియాలో కొన్ని టీపీలను పెట్టారు. టాస్క్ బజర్ మోగగానే కెప్టెన్ హారిక మినహా మిగిలిన వాళ్లంతా వెంటనే వెళ్లి గార్డెన్ ఏరియాలో ఉన్న టోపీలను తీసుకుని ధరించాలని చెప్పారు. తదుపరి ఆదేశం వచ్చేవరకూ ఆ టోపీలను ధరించి కదలకుండా అలాగే ఉండాలని చెప్పారు బిగ్ బాస్. రెడ్ కలర్ టోపీ వచ్చిన అభిజిత్,అవినాష్,అఖిల్,అరియానా నామినేట్ అయ్యారని బ్లూ టోపీ వచ్చిన సోహైల్,మోనాల్ సేవ్ అయినట్లు చెప్పారు.
నామినేట్ అయిన నలుగురు గార్డెన్ ఏరియాలో ఉన్న శవపేటికలో ఉండాలని బిగ్ బాస్ ఆదేశించారు. అనంతరం నామినేట్ అయిన సభ్యుడు సేవ్ అయిన సభ్యులతో స్వాప్ చేసుకునే అవకాశం ఇచ్చారు. తొలుత అవినాష్ …మోనాల్‌ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. కానీ మోనాల్ ఎంతకు ఒప్పుకోలేదు. తర్వాత అఖిల్ కూడా మోనాల్‌ను ఒప్పించే ప్రయత్నం చేయగా ఆమె ఒప్పుకోలేదు. ఇక అరియానా తొలుత సొహైల్ తర్వాత మోనాల్‌ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఇక అభిజిత్ తాను ఎవరిని అడగనని అందుకు ఎవరు ఒప్పుకోరని తెలిపారు.
ఎవరూ ఒప్పుకోకపోవడంతో కెప్టెన్ పవర్‌ని ఉపయోగించి ఒకరిని స్వాప్ చేయాలని కోరారు బిగ్ బాస్. దీంతో సందిగ్దంలో పడ్డ హారిక…మోనాల్‌ని అభిజిత్ కోసం స్వాప్ చేసింది. అయితే స్వాప్ చేసినా పర్లేదు కానీ.. కరెక్ట్ పర్శన్‌తో చేయి అంటూ కుమిలి కుమిలి ఏడ్చింది మోనాల్.మొదటిసారి నాకోసం నేను నా గొంతు ఎత్తాను.. నా కోసం నేను నిలబడ్డాను అంటూ అభిజిత్ దగ్గర ఏడ్చేసింది మోనాల్. అయితే హారిక చివర్లో వచ్చి తలని గిరగిరా తిప్పుతూ తెగ ఏడ్చేసింది. ఇక అఖిల్ తెగ బాధపడుతుంటే సొహైల్ వెళ్లి.. మా అన్న ఉంటాడు ఎలిమినేట్ కాడు అంటూ ధైర్యం చెప్పాడు. దీంతో ఈ వారం నామినేషన్‌లో మోనాల్, అవినాష్, అఖిల్,అరియానాలు ఉన్నట్లు తెలిపారు బిగ్ బాస్.