బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 66 హైలైట్స్

198
episode 66
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 66 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 66వ ఎపిసోడ్‌లో భాగంగా అఖిల్-మెహబూబ్ మొండి పట్టుదలతో ఈ వారం ఇంట్లో కెప్టెన్ అయ్యే ఛాన్స్‌ని ఇంటి సభ్యులు కొల్పోవడం,అభిజిత్…హారిక హగ్ కోసం బ్రతిమిలాడటం వంటివి హైలైట్‌గా నిలిచాయి.

తొలుత మార్నింగ్ వేకప్ సాంగ్‌లో భాగంగా అదిరిపోయే పాటకు స్టెప్పులేశారు ఇంటి సభ్యులు. తర్వాత లాస్యను ఆంటీ అంటూ ఆటపట్టించాడు సొహైల్.ఈవారం కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులందరి ఫొటోలతో ఉన్న బాస్కెట్ బాల్స్ ,ఒక్కో బాల్ పై ఇంటి సభ్యుల ఫోటోలు ఉంటాయని, ఎవరి బాల్ వాళ్లు తీసుకోకుండా పక్కనున్న వాళ్లది తీసుకోవాలని బజర్ మోగే టైంలో బాస్కెట్‌లో వేయాలని..చివరగా పడ్డవారు గేమ్ నుండి తప్పుకుంటారని చివరగా మిగిలిన వారు ఇంటి కెప్టెన్ అవుతారని తెలిపారు బిగ్ బాస్.

మొదట లాస్య, ఆ తరువాత అరియానా, మోనాల్, అభిజిల్ ఇలా ఒక్కొక్కరుగా గేమ్ నుంచి ఔట్ కాగా.. చివరికి ముగ్గురు మిత్రులు మెహబూబ్, అఖిల్,సొహైల్‌లు మాత్రమే మిగిలారు. అయితే సొహైల్ ఆల్రెడీ కెప్టెన్ కావడంతో మెహబూబ్, అఖిల్‌ల కోసం త్యాగం చేసి గేమ్ నుంచి తప్పుకున్నాడు.

అయితే అఖిల్-మెహబూబ్‌లు తాను కెప్టెన్ అవుతా అంటే తాను అవుతానని రచ్చరచ్చ చేశారు. నామినేషన్స్‌లో ఉన్నాను కాబట్టి కెప్టెన్ అయితే ఇమ్యునిటీ లభిస్తుందని మెహబూబ్ తెలపగా ఇప్పటి వరకూ కెప్టెన్ కాలేదని అందుకే తనకు సపోర్ట్ చేయాలని అఖిల్‌ కోరాడు. అయితే ఈ ఇద్దరూ ఒకరి బాల్ ఒకరు పట్టుకోవాల్సి ఉండగా.. ఎవరి బాల్ వాళ్లే పట్టుకుని కెప్టెన్ నేనౌతా అంటే నేనౌతా అని భీష్మించుకుని కూర్చున్నారు. చివరగా బజర్ మోగినా ఇద్దరు వెనక్కి తగ్గలేదు. దీంతో కోపం వచ్చిన బిగ్ బాస్ మొత్తం టాస్క్‌నే రద్దు చేసి ఈ వారం ఇంట్లో కెప్టెన్ ఉండరని తెలిపారు.

దీంతో కోపంతో ఇద్దరిపై అసహనం వ్యక్తం చేశాడు సోహైల్. అఖిల్ కూడా మెహబూబ్-సొహైల్‌ పై తనదైన శైలీలో మండిపడ్డాడు. బిగ్ బాస్ హౌస్‌లో బాండింగ్.. రిలేషన్.. ఫ్రెండ్ షిప్ ఏదీ ఉండదు.. అన్నీ అబద్ధలే.. నటిస్తారు అంతా అంటూ కంటతడి పెట్టాడు అఖిల్. అయితే మీ ఇద్దరి కోసం నేను గేమ్ వదిలేస్తే మీరు ఇగోలకు పోయి గేమ్‌ని పోగొట్టారు అంటూ సొహైల్ తెగ బాధపడ్డాడు. చివరగా ముగ్గురు కలిసి మాటలయుద్దానికి పుల్ స్టాప్ పెట్టారు.

ఎపిసోడ్ చివరలో తనకు హారిక హగ్ ఇవ్వడం లేదని తెగ ఫీల్ అయిపోయాడు అభిజిత్. వీరిద్దరి డిస్కషన్ ఎక్కడికో వెళ్తుండటంతో మధ్యలో ఉన్న లాస్య అక్కడి నుండి లేచి వెళ్లిపోయింది. తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యులందరిని బ్యాగ్‌లు సర్ధించి ట్విస్ట్ ఇచ్చారు.

- Advertisement -