బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 65 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 65వ ఎపిసోడ్‌లో భాగంగా ఇంట్లోని అవినాష్,లాస్య,అఖిల్ మినహా మిగితావారంతా ఎలిమినేషన్‌కు నామినేట్ కాగా ఎలిమినేషన్‌లో ఉన్న మెజార్టీ సభ్యులు అరియానాను నామినేట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
అమ్మా రాజశేఖర్ ఎలిమినేషన్‌తో సొహైల్ కన్నీటి పర్యంతం అయ్యాడు. మనసులో ఏం పెట్టుకోకుండా.. వెళ్లి సారీ చెప్తే వెంటనే కరిగిపోయేవాడు.. 10 వారాలు బాగా ఎంటర్ టైన్ చేశారు అంటూ కంటతడి పెట్టుకున్నారు. నేను ఈ హౌస్‌లో ఒంటరి దానిలా మిగిలిపోయా.. ఇంకా ఎందుకు ఒంటిరిగా చేస్తున్నారు బిగ్ బాస్ అంటూ కెమెరా ముందుకు వచ్చి అరియానా బోరున ఏడ్చేసింది.
తర్వాత అభిజిత్ దగ్గర కూర్చుని ముచ్చట్లలో భాగంగా హిందీలో పాటపాడింది మోనాల్. దీంతో మాస్టర్ కెప్టెన్‌గా పెట్టిన శిక్షను అమలు చేస్తూ జైల్లో పెట్టారు. పదోవారం నామినేషన్‌లో భాగంగా ఒక్కొక్కరు ఇద్దరిద్దర్నీ నామినేట్ చేసి తగిన కారణం చెప్పాలని.. నామినేట్ చేసిన వాళ్ల తలపై బాటిల్‌ని పగలగొట్టాలని చెప్పారు బిగ్ బాస్. అవినాష్‌కి ఇమ్యునిటీ లభించడంతో అతన్ని నామినేట్ చేయకూడదని చెప్పారు.
తొలుత మెహబూబ్.. హారిక, అరియానాలను నామినేట్ చేయగా హారిక.. అరియానా, మెహబూబ్, అవినాష్.. హారిక, మోనాల్, సొహైల్.. అభిజిత్,అరియానా, అభిజిత్.. అరియానా, సొహైల్, అఖిల్.. అభిజిత్, అరియానా, లాస్య.. అరియానా, మెహబూబ్, మోనాల్.. అరియానా, మెహబూబ్,అరియానా.. మోనాల్, సొహైల్‌లను నామినేట్ చేశారు.దీంతో పదోవారం నామినేషన్స్‌లో అరియానాతో పాటు మెహబూబ్, అభిజిత్, హారిక, మోనాల్,సొహైల్‌లు ఉన్నారు.
అయితే హౌస్ మొత్తం ఏకమై మూకుమ్మడిగా తనని నామినేట్ చేయడంపై అవినాష్ దగ్గర తెగ బాధపడింది అరియానా. బాటిల్ తీసుకుని కొట్టమంటే లాస్య చాలా గట్టిగా కొట్టిందని చాలా నొప్పిగా ఉందంటూ అవినాష్‌కి చూపించింది. హౌస్ మొత్తం నామినేట్ చేసినా మొదట సేవ్ అయ్యేది నువ్వే అంటూ అరియానాకు ధైర్యం చెప్పాడు అవినాష్.అభిజిత్ గేమ్ సరిగా ఆడలేదన్న కారణంతో నామినేట్ చేసి.. ఆ తరువాత నిన్ను కావాలని నామినేట్ చేయలేదు అభి.. ఈ చాక్లెట్ చేతిలో పెట్టగా అభి కూడా అంతే ఘాటుగా రిలప్లై ఇచ్చారు.