బోల్డ్ ట్యాగ్ వద్దు…ఇంటికి వెళ్లిపోతా: అరియానా కంటతడి

127
ariyana avinash

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 10వ వారంలోకి అడుగుపెట్టింది. 10వ వారం వచ్చే సరికి ఇంటి సభ్యులంతా అరియానాను టార్గెట్ చేశారు. ఇంట్లోని 8 మందిలో ఒక్క అవినాష్ తప్ప మిగితా వారంతా అరియానాను నామినేట్ చేశారు. దీంతో తెగ బాధపడిపోయింది అరియానా.

నామినేషన్ ఎపిసోడ్‌కు ముందు బిగ్ బాస్ కెమెరా ముందుకు వచ్చిన అరియానా…తాను ఈ హౌస్‌లో ఒంటరి దానిలా మిగిలిపోయా.. ఇంకా ఎందుకు ఒంటిరిగా చేస్తున్నారు బిగ్ బాస్ అంటూ బోరున ఏడ్చేసింది. నాకు అసలు ఇక్కడ ఉండాలని అనిపించడం లేదు.. నన్ను కూడా బయటకు పంపించేయండి …ఇలాంటి దారుణమైన పరిస్థితిని నేను ఫేస్ చేయలేకపోతున్నా అని చెప్పుకొచ్చింది. .

నా అనుకున్న వాళ్లని చాలా మిస్ అవుతున్నా.. నా లైఫ్‌లో నాకు చాలా తక్కువ మంది ఉన్నారు. నేను వాళ్లతో హ్యాపీగా ఉంటాను.. ఇక్కడ ఉన్న వాళ్లెవరూ నాకు నచ్చడం లేదు అని తెలిపింది అరియానా.ఇక నామినేషన్ ఎపిసోడ్‌ తర్వాత అవినాష్ దగ్గర తన బాధను చెప్పుకుంటూ కంటతడి పెట్టింది అరియానా. బాటిల్ తీసుకుని కొట్టమంటే లాస్య చాలా గట్టిగా కొట్టిందని చాలా నొప్పిగా ఉందంటూ అవినాష్‌కి చూపించింది. ఎలిమినేట్ అయ్యి వెళిపోవాలని ఉంది అని అరియానా చెప్పగా ధైర్యం చెప్పి ఓదార్చాడు అవినాష్‌.