బిగ్ బాస్ 4….ఎపిసోడ్ 63 హైలైట్స్

213
bigg boss
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ విజయవంతంగా 63 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 63వ ఎపిసోడ్‌లో కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా ఇంటి సభ్యులతో మాట్లాడటం,ఎలిమినేషన్‌ నుండి హారిక సేవ్ అవడం వంటివి హైలైట్‌గా నిలిచాయి.

తొలుత మాస్ బీట్ సాంగ్‌కి హుషారెత్తించే స్టెప్పులు వేస్తూ ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. అనంతరం ఇంటి సభ్యుల్ని మన టీవీ ద్వారా చూపించారు.ఈ వారం వరు ఎలిమినేట్ అవుతారనే దానిపై అవినాష్, అమ్మా రాజశేఖర్, అరియానాల మధ్య చర్చ నడిచింది. అరియానా.. అవినాష్, అభిజిత్, హారిక, మోనాల్‌లలో ఒకరు ఎలిమినేట్ అవుతారని జోస్యం చెప్పింది.

ఇక అమ్మా రాజశేఖర్ కెప్టెన్ అయినప్పటి నుంచి శివాలెత్తుతున్న హారిక.. నేను ఐదు సార్లు కెప్టెన్ కోసం పోటీపడితే నాకు కాకుండా అవినాష్‌కి రేషన్ మేనేజర్ పదవి ఎలా ఇస్తారు అంటూ బాధపడిపోయింది. తర్వాత నెయ్యి విషయంలో సొహైల్ – అరియానా మధ్య మాటల యుద్దం నడించింది.

తర్వాత ఇంటి సభ్యులతో మాట్లాడిన నాగార్జున.. నామినేషన్స్‌లో ఉన్న అభిజిత్, మోనాల్, అమ్మా, అవినాష్, హారికలతో మాట్లాడారు. ఎలా ఉంది? మీకు ఏమనిపిస్తుందని అడగ్గా.. నేను ఆల్రెడీ ఇంటికి వెళ్లి వచ్చేశాను సార్ లాస్ట్ వీక్ అంటూ లాజిక్ మాట్లాడాడు అమ్మా రాజశేఖర్. కెప్టెన్ అయినా ఎలిమినేట్ కావొచ్చని గుర్తు చేశారు నాగార్జున.

ఆయన చెప్పింది వినడు.. ఆయన చెప్పిందే కరెక్ట్ అని అంటారు.. 30 ఏళ్ల నుంచి ఇండస్ట్రీ అంటారు కానీ ఎవరి మాట వినరు అని మాస్టర్‌ పై కంప్లైంట్ ఇచ్చారు అభిజిత్. ఇక నామినేషన్ టాస్క్‌లో కూడా నువ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అని వెళ్లిపోయావ్.. మిగతా వాళ్లకి లేదా?? వాళ్లు ఎందుకు అన్ని గంటలు నిలబడి కష్టపడ్డారు? అని అభిజిత్‌ని అడిగారు నాగ్. సెల్ఫ్ రెస్పెక్ట్ అని చెప్పి టాస్క్‌ని వదిలేయడం కరెక్టా అని అదే ఇంటి సభ్యుల్ని అడిగారు నాగార్జున. అయితే ఏ ఒక్కరూ కూడా అభిజిత్ చెప్పిన రీజన్‌ సమ్మతించలేదు.

దీవాళీ కాన్సెప్ట్‌లో భాగంగా ఇంటి సభ్యుల మధ్య ఫిగింగ్ పెడుతూ ఇంట్లో ఆరిపోయే దీపం ఎవరు?? వెలిగే దీపం ఎవరో చెప్తూ వాళ్లకి దీపాన్ని ఇచ్చి తగిన కారణం చెప్పాలని కోరారు నాగార్జున. మొదటిగా అభిజిత్ అందరూ ఊహించినట్టే అమ్మా రాజశేఖర్‌ని ఆరిపోయే దీపం చేయగా.. మొనాల్‌ని వెలిగే దీపం అని చెప్పాడు.

ఇక అరియానా …అవినాష్‌ని వెలిగే దీపం,ఆరిపోయే దీపం అభిజిత్ అని చెప్పింది. గత వారం రోజులుగా నీ బిహేవియర్ మారిపోయింది?? ఏంటి నీ ప్రాబ్లమ్.. మనుషులు దూరం అయిపోయారా? అని అన్నప్పుడు మోనాల్ ఎమోషనల్ అయ్యింది. నాకు ఎగ్‌ అంటే పడదు.. కానీ లాస్య, సొహైల్ పెట్టినా ప్రాబ్లమ్ ఉండేది కాదు.. కానీ అఖిల్ పెట్టాడు. అఖిల్ నన్ను నామినేట్ చేస్తాడని. ఎందుకంటే నన్ను నామినేట్ చేయడానికి అతని దగ్గర రీజన్ లేదు అని తెగ చెప్పుకొచ్చింది.

తాను నామినేట్ చేయడం వల్లే మోనాల్ స్ట్రాంగ్ అయిందని తెలిపాడు అఖిల్. మోనాల్ నీకు ఫ్రెండేనా?? లేక అంతకంటే ఎక్కువా? అని అడగ్గా. తల పక్కకి తిప్పుకుని యాటిట్యూడ్ చూపిస్తూ ఆలోచించుకుని ఫ్రెండ్ అని అనేశాడు అఖిల్. ఇక మోనాల్ సైతం జస్ట్ ఫ్రెండ్ అని చెప్పింది. ఇక ఈ హౌస్‌లో వెలిగే దీపం ఎవరు అని అడగ్గా.. అఖిల్ అని ఆరిపోయే దీపం అరియానా అనిచెప్పింది మోనాల్.

ఇక కమల్ బర్త్ డే సందర్భంగా ప్రేక్షకుల్ని సర్‌ ప్రైజ్ చేశారు నాగార్జున. తమిళ్ బిగ్ బాస్ హోస్ట్ చేస్తున్న కమల్‌ అక్కడ కంటెస్టెంట్స్‌తో సహా తెలుగు ప్రేక్షకుల్ని పలకరించారు. ఇక ప్రస్తుతం నామినేషన్స్‌లో ఉన్న ఐదుగురిలో ఒకర్ని సేవ్ చేయాలని కమల్‌ని నాగార్జున కోరగా.. హారికను సేవ్ చేశారు కమల్.

- Advertisement -