బిగ్ సర్‌ప్రైజ్‌…తెలుగు బిగ్ బాస్ తెరపై కమల్

29
kamal

లోక‌నాయ‌కుడు కమల్ హాసన్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా తెలుగు ప్రేక్షకులకు అదరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు బిగ్ బాస్‌. స్పెష‌ల్ ఈవెంట్ ఏర్పాటు చేస్తూ తమిళ బిగ్ బాస్ కంటెస్టెంట్లతో కలిసి తెలుగు ప్రేక్షకులకు బిగ్ ట్రీట్ ఇచ్చారు. ఓ వైపు నాగార్జున మరోవైపు కమల్‌ని చూసి ఇంటి సభ్యులు ఆనందంతో గెంతులేశారు.

క‌మ‌ల్ తెలుగులో, నాగార్జున త‌మిళంలో ప‌ల‌క‌రించుకున్నారు. హోస్ట్ నాగార్జున తమిళ్‌లో కమల్‌కు స్వాగతం పలుకగా.. కమల్ హాసన్ కూడా అందరికీ నమస్కారం బాగున్నారా? అంటూ చక్కగా తెలుగులో మాట్లాడారు. నాగార్జున మీ హౌస్‌ఫుల్ అయింది సార్ అని చెప్పుకొచ్చారు. దీనికి క‌మ‌ల్ స్పందిస్తూ హౌస్‌ఫుల్ అనేది నాకు న‌చ్చ‌ని మాట అంటూ న‌వ్వేశారు.

ప్రస్తుతం నామినేషన్స్‌లో ఉన్న ఐదుగురిలో ఒకర్ని సేవ్ చేయాలని కమల్‌ని నాగార్జున కోరగా.. నాగార్జున చూపించిన కార్డ్‌లో ఉన్న పేరుని చదివి హారికను సేవ్ చేశారు కమల్. కమల్ చేతుల మీదుగా ఈవారం ఎలిమినేషన్ నుంచి సేవ్ అయిన హారిక ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.