బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 48 హైలైట్స్‌

176
bigg boss 48
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 48 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఈ ఎపిసోడ్‌లో బ్లాక్ బస్టర్ అనే సినిమా తీసే టాస్క్‌ని ఇంటి సభ్యులకు ఇచ్చాడు. దీంతో ఈ ఎపిసోడ్ మొత్తం సినిమా తీయడంతోనే సాగగా అఖిల్-అభిజిత్ ఒక్కటవడం,ఐటమ్‌ గర్ల్‌గా హారిక,ఐటమ్ రాజాగా సొహైల్,అభి -రాజశేఖర్ మధ్య మాటల యుద్దంతో సాగిపోయింది.

తొలుత అడ్వటోరియల్ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులకు ఒక మెత్తటి పరుపును ఇచ్చారు బిగ్ బాస్. బజర్ మోగగానే ఇంటి సభ్యులంతా కలిసి ఆ పరుపు మీద పడుకోవాలి. టాస్క్ ముగిసే సమయానికి ఎవరైతే పరుపు మీద పూర్తిగా పడుకుంటారో వాళ్లే విజేత. దీంతో ఒకరి మీద ఒకరు పడిపోయి..కాళ్లు చేతులు పట్టుకుని లాక్కొని రచ్చరచ్చ చేశారు. మొత్తానికి ఈ టాస్క్‌లో దివి విజేతగా నిలవడంతో మెత్తటి పరుపు మీద పడుకోవడమే కాకుండా ఒక గంట ఎక్కువ సేపు ఆమె నిద్రపోవచ్చు.

ఇక తర్వాత బ్లాక్ బస్టర్ టాస్క్ ప్రకారం ఇంటి సభ్యులందరూ కలిసి బిగ్ బాస్ ఇంట్లో ఒక సినిమాను తీయాలి. దర్శకుడిగా- అభిజీత్, అసిస్టెంట్ డైరెక్టర్ -దివి, స్క్రిప్ట్ రైటర్ – అవినాష్, డీఓపీ – నోయల్, కొరియోగ్రాఫర్ – అమ్మ రాజశేఖర్, మేకప్ & స్టైలిష్ట్ – లాస్య, ఐటమ్ సాంగ్ డాన్సర్స్ – హారిక, సోహెల్. ఈ టాస్క్‌లో ఇంటి సభ్యులు అందరూ వాళ్లకు ఇచ్చిన పాత్రలకు తగ్గట్టుగా నటించాలని తెలపగా అవినాష్ స్క్రిప్ట్ రైటింగ్‌తోపాటు యాక్టింగ్ కూడా చేయొచ్చని వెల్లడించారు.

సినిమాలో బిగినింగ్, మిడిల్, మంచి క్లైమాక్స్ ఉండేలా చూసుకోవాలని తెలపగా ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు. అభిజీత్, దివి, అవినాష్, నోయల్ కలిసి డిస్కషన్ పెట్టినప్పుడు అక్కడికి అమ్మ రాజశేఖర్ వెళ్లారు. ఆ సమయంలో ఐటమ్ సాంగ్ గురించి చర్చ జరిగింది. దీంతో కొరియోగ్రాఫర్‌గా అది తన ఇష్టమని తెలపగా అభిజిత్-మాస్టర్ మధ్య మాటల యుద్దం జరిగింది.

సాంగ్ చేసేటప్పుడు డాన్సర్స్, డీఓపీ మాత్రమే కొరియోగ్రాఫర్‌తో ఉండాలని దర్శకుడు అవరసం లేదని గుర్తు చేసిన అమ్మ అక్కడి నుండి లేచి వెళ్లిపోయాడు. తర్వాత దివి వెళ్లి కూల్ చేసేందుకు ప్రయత్నించిన రాజశేఖర్ మాస్టర్ తగ్గలేదు.ఇక ఐటమ్ సాంగ్‌తో అలరించారు హారిక, సోహెల్. కెవ్వు కేక సాంగ్‌కి వీరిద్దరితో కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ రిహార్సిల్స్ చేయించారు. మొత్తం మీద కిందా మీదా పడి బిగ్ బాస్ బ్లాస్ బస్టర్ సినిమాను ఇంటి సభ్యులు పూర్తిచేసేశారు.

- Advertisement -